News


డేటా కొత్త ఆయిల్‌ కాదు

Friday 13th September 2019
news_main1568348945.png-28345

  • దీన్ని దేశ సరిహద్దుల పరిధిలోనే నిలిపివేయకూడదు
  • సాఫీగా సరిహద్దులు దాటిపోయేలా చూడాలి
  • ముకేశ్‌ అంబానీకి ఫేస్‌బుక్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ: డేటా విషయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అం‍బానీ ప్రకటనకు కౌంటర్‌గా అన్నట్టు ఫేస్‌బుక్‌ భిన్నంగా స్పందించింది. డేటా అన్నది కొత్త చమురు కాదని, దీన్ని ఒక దేశం పరిధిలోనే నిల్వ చేయరాదని ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిక్‌క్లెగ్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ వంటి దేశాలు డేటాను ఓ పరిమిత వస్తువుగా నిలిపివేయకుండా, సాఫీగా దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘జాతి భద్రత దృష్ట్యా భారత్‌ వంటి దేశాలకు షేటాను పంచుకోవడం ఇప్పుడు కీలకం. ఎందుకంటే తీవ్ర నేరాలు, ఉగ్రవాదాన్ని తుదముట్టించే లక్ష్యంతో అంతర్జాతీయ డేటాను పంచుకునేందుకు భారత్‌ గొప్ప చర్యలనే చేపట్టింది’’ అని క్లెగ్‌ గుర్తు చేశారు. డేటాను దేశీయంగానే నిల్వ చేయాలని, ఇందుకు అన్ని కంపెనీలు చేర్యలు చేపట్టాలిని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. 
హక్కులను గౌరవించాలి..
‘‘తమ డేటాకు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తుల హక్కులను గౌరవించాలి. పోటీని, ఆవిష్కరణను ప్రోత్సహించాలి. ప్రతీ ఒక్కరు డేటాను పొందే దిశగా దాన్ని అందుబాటులో ఉంచాలి. ఈ దిశగా ఇంటర్నెట్‌కు భారత్‌ కొత్త నిర్వచనం చెప్పాలి’’ అని నిక్‌క్లెగ్‌ అన్నారు. డేటాను ‘న్యూ ఆయిల్‌’ (కొత్త ఇంధనం) అని, సామాజిక మాధ్యమ వేదికలు, ఇంటర్న్‌పై భారత యూజర్ల డేటాను కాపాడాల్సి ఉందని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇటీవలే వ్యాఖ్యానించారు. ‘‘దేశ డేటాను భారత వ్యక్తులే కలిగి ఉండడం, నియంత్రించడం చేయాలి. అది దేశీయ, అంతర్జాతీయ కొర్పొరేట్లు కాదు’’ అని అంబానీ పేర్కొన్నారు. ‘‘భారత్‌లో చాలా మంది, అలాగే ప్రపంచ వ్యాప్తంగా డేటాను కొందరు కొత్త ఆయిల్‌గా భావిస్తున్నారు. దేశం పరిధిలోనే భారీ చమురు నిల్వలను కలిగి ఉండొచ్చు. ఇది కచ్చితంగా సంపదను పెంచుతుంది. కానీ, ఈ విధమైన పోలిక పొరపాటే అవుతుంది’’ అని క్లెగ్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గురువారం ఓ మీడియా సంస్థకు తెలిపారు. ‘‘నిలిపి ఉంచడం వల్ల డేటాకు విలువ రాదు. దాన్ని స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అనుమతించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలి’’ అని ఆయన సూచించారు. భారత్‌కు అధిక సంపద ఆవిష్కరణల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తమ భౌగోళిక సరిహద్దుల పరిధిలోనే డేటాకు కళ్లెం వేసి, దాన్ని విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల... ఆవిష్కరణల సముద్రం కాస్తా ఓ సరస్సుగా మారిపోతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీల చేతుల్లోని భారతీయ యూజర్ల డేటా భద్రంగా ఉంటుందా? అన్న సందేహాల నేపథ్యంలో నిక్‌ క్లెగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం ఉన్నవే అవుతాయి. You may be interested

కారు... పల్లెటూరు..!

Friday 13th September 2019

-మందగమనంతో తగ్గిన డిమాండ్‌ -ఇరవైఏళ్ల కనిష్టానికి వాహన విక్రయాలు  -అమ్మకాల కోసం పల్లెబాటలో వాహన కంపెనీలు  -ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు -అమ్మకాలు పుంజుకుంటాయని ఆశలు  -గ్రామ మహోత్సవాల నిర్వహణ  -తక్కువ వడ్డీరేట్లకు రుణాలు -ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు -సేల్స్‌, సర్వీస్‌ సెంటర్ల ఏర్పాటు  పల్లెకు పోదాం.. పారును చూద్దాం.. ఛలో..ఛలో అని అప్పుడు దేవదాసు పల్లెబాట పట్టాడు. ఇప్పుడు వాహన కంపెనీలు కూడా పల్లె బాట పడుతున్నాయి. పల్లెకు పోదాం.... మందగమనాన్ని తట్టుకుందాం... అమ్మకాలు పెంచుకుందాం అని పాట పాడుతున్నాయి. గ్రామీణులను

అమ్మకానికి దేనా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం

Friday 13th September 2019

రిజర్వ్‌ ప్రైస్‌ రూ. 530 కోట్లు ముంబై: దేనా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విక్రయించనుంది. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని హెడ్‌ క్వార్టర్స్‌ను విక్రయించడానికి రూ. 530 కోట్లు రిజర్వ్‌ ప్రైస్‌ నిర్ణయించింది. అమ్మకం, వేలం కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. వార్తాపత్రికలలో గురువారం ప్రచురించిన ఆఫర్ పత్రం ప్రకారం.. ఈ-వేలం ద్వారా కార్యాలయాన్ని విక్రయానికి ఉంచనున్నట్లు స్పష్టమైంది. అక్టోబర్‌ 18న వేలం నిర్వహించనుంది. కదిలించగలిగే ఫర్నిచర్, ఫిక్ఛర్స్‌

Most from this category