News


ఏపీలో డావ్‌ ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ ప్లాంటు

Tuesday 17th December 2019
news_main1576552554.png-30257

  • సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి
  • తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు
  • కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ అచ్యుతుని

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న చైనాకు చెందిన డావ్‌ ఈవీటెక్‌.. భారత్‌లో ఆటోమొబైల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నానికి దగ్గరలో దీనిని నెలకొల్పనుంది. 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ అచ్యుతుని సోమవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఏటా 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. ఇంక్యుబేషన్‌ సెంటర్‌తోపాటు బ్యాటరీ, చాసిస్‌, కంట్రోలర్స్‌, మోటార్ల తయారీ సైతం ఇక్కడ చేపడతామని చెప్పారు. నవంబరులో ఈ కాంప్లెక్స్‌ నుంచి తొలి ఉత్పాదన రెడీ అయ్యే అవకాశముందన్నారు. మూడేళ్లలో రూ.700 కోట్లు ఖర్చు చేస్తామని, ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. 40 దాకా అనుబంధ పరిశ్రమలు వస్తాయన్నారు. 
ఫిబ్రవరిలో తొలి వాహనం...
డావ్‌ ఈవీటెక్‌ భారత్‌లో తొలి వాహనాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తోంది. వచ్చే ఏడాది ఆరు మోడళ్లను ప్రవేశపెడతామని డావ్‌ ఈవీటెక్‌ చైర్మన్‌ మైఖేల్‌ లియో వెల్లడించారు. అంతర్జాతీయంగా 25 ఏళ్లపాటు ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో సాధించిన అనుభవంతో భారత్‌లో అడుగు పెడుతున్నట్టు చెప్పారు. గంటకు 25 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించే లో స్పీడ్‌ మోడళ్లు 3... అలాగే 25 కిలోమీటర్లకంటే వేగంగా ప్రయాణించే హై స్పీడ్‌ మోడళ్లు 3 అందుబాటులోకి తెస్తారు. వీటిలో ఇంటర్నెట్‌తో అనుసంధానించిన వాహనాలు కూడా ఉంటాయని కంపెనీ సీవోవో లానా జోయో తెలిపారు. కాగా, వాహనాల ధర లో స్పీడ్‌ అయితే రూ.50-75 వేలు, హై స్పీడ్‌ మోడళ్లు రూ.75 వేల నుంచి రూ.1 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి చార్జ్‌ చేస్తే మోడల్‌ను బట్టి 100-125 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. సొంత ప్లాంటు రెడీ అయ్యే వరకు హైదరాబాద్‌ సమీపంలోని తూప్రాన్‌ వద్ద ఉన్న అసెంబ్లింగ్‌ ప్లాంటులో టూ వీలర్లు రూపుదిద్దుకుంటాయి. 
 You may be interested

సెజ్‌లోని ఐటీ కంపెనీల పన్ను తగ్గించండి

Tuesday 17th December 2019

15 శాతానికి పరిమితం చేయాలన్న ఐటీ పరిశ్రమ బీమాపై పన్ను భారం తగ్గించాలన్న ఆర్థిక రంగ సంస్థలు పన్నులను క్రమబద్ధీకరించాలన్న మొబైల్‌ కంపెనీలు బడ్జెట్‌ ముందస్తు చర్చలో భాగంగా డిమాండ్లు న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) నుంచి పనిచేసే ఐటీ కంపెనీలపై 15 శాతమే కార్పొరేట్‌ పన్ను విధించాలని కేంద్రాన్ని ఐటీ పరిశ్రమ డిమాండ్‌ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న దృష్ట్యా... దీనికోసం సోమవారం

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి జియో టవర్ల కంపెనీ

Tuesday 17th December 2019

డీల్‌ విలువ రూ.25,215 కోట్లు  దేశీ ఇన్‌ఫ్రాలో భారీ విదేశీ పెట్టుబడి ఇదే! న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొబైల్‌ కంపెనీ రిలయన్స్‌ జియోకు చెందిన టవర్ల వ్యాపారాన్ని కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పార్ట్‌నర్స్‌ ఎల్‌పీ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.25,212 కోట్లు. ఒక భారత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలో విదేశీ కంపెనీ పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదే కావటం గమనార్హం. ఈ మేరకు బ్రూక్‌ఫీల్డ్‌తో తమ రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌

Most from this category