News


చైర్మన్‌ హోదా అక్కర్లేదు!!

Monday 6th January 2020
news_main1578281007.png-30688

  • టాటా గ్రూప్‌లో అసలే పదవిపైనా ఆసక్తి లేదు
  • మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కుల రక్షణే లక్ష్యం
  • సైరస్ మిస్త్రీ స్పష్టీకరణ

ముంబై: టాటా సన్స్ చైర్మన్‌గా పునఃనియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ .. తనకు ఆ హోదాపై ఆసక్తేమీ లేదని సైరస్ మిస్త్రీ స్పష్టం చేశారు. అసలు టాటా గ్రూప్‌లో ఏ పదవీ తనకు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిస్త్రీ వివరించారు. అంతిమంగా వ్యక్తుల కన్నా సంస్థ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.  అయితే, మైనారిటీ షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తానని తెలిపారు. సైరస్ మిస్త్రీ ఆదివారం ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. "నా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాను. ఎన్‌సీఎల్‌ఏటీ నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. నాకు టాటా సన్స్ చైర్మన్‌ హోదా గానీ టీసీఎస్‌, టాటా టెలీసర్వీసెస్‌, టాటా ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌హోదాపై గానీ ఆసక్తేమీ లేదు. అయితే, బోర్డులో చోటు సాధించడం సహా మైనారిటీ షేర్‌హోల్డరుగా హక్కులను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తాను" అని మిస్త్రీ పేర్కొన్నారు. మిస్త్రీని చైర్మన్‌గా తిరిగి తీసుకోవాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను సవాల్ చేస్తూ టాటా గ్రూప్‌.. సుప్రీం కోర్టులో అత్యవసర పిటీషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మిస్త్రీ బహిరంగ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు నాలుగేళ్ల క్రితం చైర్మన్‌ హోదా నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీని పునఃనియమిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ 2019 డిసెంబర్‌లో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలు గ్రూప్ సంస్థలు, టాటా ట్రస్ట్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. You may be interested

ఫండ్స్‌లో ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి ?

Monday 6th January 2020

ప్ర: నాకు రెండేళ్ల కూతురు ఉంది. తనను మంచి చదువులు చదివించాలన్న ఆలోచనతో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టాను. ఇది సరైన నిర్ణయమేనా ?  -అనిత, విశాఖపట్టణం  జ: మీరు మొదటిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదు. ఆరంభంలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. దీంతో మొదటిసారిగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్టర్లు బెంబేలు పడతారు. ఫండ్సంటే భయపడేలా నష్టాలూ

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్లు డౌన్‌

Monday 6th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్లు మైనస్‌ ఇరాన్‌, అమెరికా మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 12,203 పాయింట్ల  వద్ద  కదులుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,260 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా

Most from this category