News


సైయంట్‌ లాభం రూ.108 కోట్లు

Friday 17th January 2020
news_main1579231189.png-30976

హైదరాబాద్‌: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3) ఆర్థిక ఫలితాల్లో సైయంట్‌ మిశ్రమ ఫలితాలు సాధించింది. నికరలాభం గణనీయంగా పెరిగినా... మొత్తం ఆదాయంలో మాత్రం క్షీణత నమోదయింది. క్యూ3 కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.108 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్యూ2లో నికరలాభం రూ.98.5 కోట్లుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.92 కోట్లుగా ఉంది. లాభాల్లో క్యూ2తో పోలిస్తే 10 శాతం, గతేడాది క్యూ3తో పోలిస్తే 17.6 శాతం వృద్ధి కనిపించింది. క్యూ3లో మొత్తం ఆదాయం రూ.1106 కోట్లుగా ఉంది. క్యూ2లో మొత్తం ఆదాయం రూ.1158 కోట్లు, గతేడాది క్యూ3లో 1187 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో క్యూ2తో పోలిస్తే 4.6 శాతం, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 6.9 శాతం క్షీణించినట్లు లెక్క. 



You may be interested

దక్షిణాదిన ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ ప్లాంటు!

Friday 17th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అయిదు ప్లాంట్లలో వినియోగం పూర్తి స్థాయికి చేరుకున్నందును కొత్త ఫెసిలిటీ అవసరమని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ జైన్‌  వెల్లడించారు. ఎలిగంజా సిరీస్‌ ఉత్పత్తులను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత ప్లాంటును ఎక్కడ, ఎంత మొత్తంతో ఏర్పాటు చేసేదీ త్వరలో

టెల్కోల ఎఫెక్ట్‌...వీక్‌ ఓపెనింగ్‌?

Friday 17th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు మైనస్‌ సుప్రీం కోర్టు టెలికాం కంపెనీల ఏజీఆర్‌ చెల్లింపులపై పిటీషన్‌ కొట్టివేయడంతో ఆ షేర్లతో పాటు, ఆయా కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడనున్న నేపథ్యంలో  నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 21 పాయింట్లు క్షీణించి 12,349 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,370 పాయింట్ల

Most from this category