News


బ్యాంకు మోసాలపై సీవీసీ కమిటీ

Monday 26th August 2019
news_main1566792440.png-28006

న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే మోసం ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వీటిపై దృష్టి సారించింది. రూ. 50 కోట్ల పైబడిన బ్యాంకు మోసాలను పరిశీలించి, తగు చర్యలు సిఫార్సు చేసేందుకు బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌పై అడ్వైజరీ బోర్డు (ఏబీబీఎఫ్‌) ఏర్పాటు చేసింది. మాజీ విజిలెన్స్ కమిషనర్ టీఎం భాసిన్ దీనికి సారథ్యం వహిస్తారు. గతంలో దీన్ని అడ్వైజరీ బోర్డ్ ఆన్ బ్యాంక్, కమర్షియల్‌ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌గా వ్యవహరించేవారు. సీవీసీ ఉత్తర్వుల ప్రకారం రూ. 50 కోట్ల పైబడిన ఫ్రాడ్‌ కేసులను బ్యాంకులు ఈ బోర్డుకు నివేదిస్తాయి. బోర్డు సిఫార్సుల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)కు సంబంధించిన కేసుల్లో సాంకేతికంగానైనా, ఇతరత్రానైనా ఏవైనా సమస్యలు ఎదురైన పక్షంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా బోర్డును సంప్రతించవచ్చు. ఈ ప్యానెల్‌లో నలుగురు సభ్యులు ఉంటారు. పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి మధుసూదన్ ప్రసాద్‌, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాజీ డైరెక్టర్ జనరల్ డీకే పాఠక్‌, ఆంధ్రా బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో సురేష్ ఎన్‌ పటేల్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు. బోర్డు చైర్మన్‌, సభ్యుల పదవీకాలం 2019 ఆగస్టు 21 నుంచి రెండేళ్ల పాటు ఉంటుంది.



You may be interested

గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల్లో జంప్‌

Monday 26th August 2019

- రూ.5,000 కోట్లను దాటిన ఏయూఎం న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నిర్వహణలోని ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల మార్కును దాటాయి. జూలైలో ఏయూఎం రూ.5,079.22 కోట్లుగా నమోదైనట్లు మార్నింగ్‌స్టార్ తాజా డేటాలో వెల్లడైంది. ఈ ఏడాదిలో.. ఆగస్టులో రూ. 4,594 కోట్లు, మేలో రూ. 4,607 కోట్లు, జూన్‌లో రూ. 4,931 కోట్లు ఏయూఎం నమోదైంది. స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం

రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 26th August 2019

ధీరేంద్ర కుమార్‌ సీఈవో వాల్యూ రీసెర్చ్‌ సీఈవో ప్ర: నా వయస్సు 25 సంవత్సరాలు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా  ఇటీవలనే ఉద్యోగంలో చేరాను. 10 నుంచి 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? లేక మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ?  -శివాజీ, హైదరాబాద్‌ జ: మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ రెండింటిలో దేనినీ ఎంచుకోవద్దు. మీరు 10–15 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మల్టీ–క్యాప్‌

Most from this category