News


పెట్టుబడుల్ని రప్పించేందుకే కార్పొరేట్ పన్ను కోత

Saturday 30th November 2019
news_main1575086775.png-29973

  • వృద్ధి మందగించింది కాబట్టే ఈ చర్యలు
  • సీఈఏ కేవీ సుబ్రమణియన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: పెట్టుబడులకు ఊతమిచ్చేందుకే కేంద్రం కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ వెల్లడించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పడే ప్రగతి చక్రాలు ఆశించినంత వేగంగా పరుగు తీయకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలియజేశారు. ఇండియా ఎకనమిక్‌ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం సుబ్రమణియన్‌ ఈ విషయాలు చెప్పారు.  "ఉత్పాదకత మెరుగుపడితే వేతనాలు పెరుగుతాయి. ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎగుమతులు పెరుగుతాయి. ఇవన్నీ కలిస్తే అంతిమంగా వినియోగదారుల కొనుగోలు శక్తి మెరుగుపడి, డిమాండ్‌ పెరుగుతుంది. ఈ డిమాండ్‌ ఆధారంగానే కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత పెరిగేందుకు ఈ పెట్టుబడులు కీలకం. ఇదో చక్రం లాంటిది. గతంలో 7 శాతం పైగా వృద్ధి రేటు ఉన్నప్పుడు.. ఈ చక్రాలు వేగంగా పరుగెత్తేవి.. కానీ గడిచిన కొన్ని త్రైమాసికాలుగా ఆశించినంత స్థాయిలో పరుగు తియ్యడం లేదు. అందుకే .. పెట్టుబడులను ఆకర్షించేందుకు, వ్యవస్థలో మందగమనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును తగ్గించింది" అని సుబ్రమణియన్‌ వివరించారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి, కొత్తగా వచ్చే తయారీ కంపెనీలకు 15 శాతానికే (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించేందుకు) పరిమితం చేస్తూ సెప్టెంబర్‌లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. 
కీలక సంస్కరణలతో ఎకానమీకి ఊతం..
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరిన్ని సంస్కరణలను కూడా సుబ్రమణియన్‌ వివరించారు. దివాలా చట్టం, కార్మిక చట్ట సంస్కరణలు, ఏదైనా సంస్థ రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయితే వెంటనే వెల్లడించేలా సెబీ తాజా మార్గదర్శకాలు మొదలైనవి ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. 



You may be interested

క్యాషే కింగ్‌!

Saturday 30th November 2019

రియల్టీ లావాదేవీల్లో బ్లాక్‌ మనీదే హవా 30 శాతం చెల్లింపులు నగదు రూపంలోనే సాక్షి, హైదరాబాద్‌:- నగదు లావాదేవీల్లో బ్లాక్‌ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన రూ.1,000, రూ.500 నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. డీమానిటైజేషన్‌ చేపట్టి మూడేళ్లు గడిచినా.. నేటికీ ప్రాపర్టీ డీల్స్‌లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో కంటే ద్వితీయ శ్రేణి నగరాల్లోని గృహ విభాగంలోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని అనరాక్‌

హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సదస్సు

Saturday 30th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వ్యవసాయ సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నిర్వహించే ‘అగ్రిటెక్‌ సౌత్‌ 2020 ప్రదర్శన’, ‘అగ్రి విజన్‌ 2020’ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక అవుతోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 మధ్య ఈ కార్యక్రమం జరుగనుంది. 150 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటవుతాయి. 

Most from this category