News


ఆపరేటర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు..

Tuesday 24th September 2019
news_main1569297243.png-28505

  • టెల్కోలను సులువుగా మారుస్తున్న కస్టమర్లు
  • రెండో స్థానంలో తెలంగాణ, ఏపీ సర్కిల్‌
  • ఇప్పటికే ఎంఎన్‌పీ అభ్యర్థనలు 44.7 కోట్లు్

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో సేవలు అందకపోతే కస్టమర్లు మరో ఆపరేటర్‌కు సులువుగా మారుతున్నారు. 2019 జూలై 31 నాటికి 44.74 కోట్ల మంది ఎంఎన్‌పీ సేవలను వినియోగించుకున్నారంటే వినియోగదార్లలో ఉన్న చైతన్యం అర్థం చేసుకోవచ్చు. ఇలా అభ్యర్థనలు వచ్చిన రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 4.14 కోట్ల దరఖాస్తులతో కర్నాటక తొలి స్థానంలో ఉండగా.. 3.78 కోట్ల రిక్వెస్టులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ రెండో స్థానం కైవసం చేసుకుంది. తమిళనాడు, రాజస్తాన్‌, మహారాష్ట్ర సర్కిళ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఎంఎన్‌పీ కోసం 59.2 లక్షల మంది వినియోగదార్ల నుంచి విన్నపాలు వచ్చాయి. 2010 నవంబరు 25న హరియాణా సర్వీస్‌ ఏరియాలో తొలుత ఎంఎన్‌పీ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత దశలవారీగా అన్ని టెలికం సర్కిళ్లకు ఈ సర్వీసును విస్తరించారు.
పెరుగుతున్న ఫిర్యాదులు ...
టెలికం రంగంలో భారత్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 2జీ తర్వాత 3జీ విస్తరణ కంటే వేగంగా 4జీ సేవలు దూసుకుపోయాయి. ప్రధానంగా రిలయన్స్‌ జియో రాకతో టెలికం రంగంలో పోటీ తీవ్రమైంది. 2019 జూలై నాటికి భారత్‌లో వైర్‌లెస్‌ చందాదారులు 97.2 కోట్ల మంది ఉన్నారు. మెరుగైన సేవల కోసం వినియోగదార్లు ఖర్చుకు వెనుకంజ వేయడం లేదు. మరోవైపు కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉత్తమ కవరేజ్‌, సర్వీసుల కోసం ఏటా అన్ని టెలికం కంపెనీలు ఎంత కాదన్నా రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ ప్రాజెక్ట్‌ లీప్‌ కింద రూ.10,000 కోట్లు వ్యయం చేస్తోంది. టవర్ల ఏర్పాటును రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు అడ్డుకోరాదన్న సుప్రీం తీర్పు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మరోవైపు కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ చొరవతో టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను వినియోగించుకునే వెసులుబాటు టెలికం కంపెనీలకు లభించింది. 
ప్రధాన సమస్యలు ఇవే ...
కవరేజ్‌, డేటా స్పీడ్‌, కాల్‌ డ్రాప్‌, కాల్‌ కనెక్టివిటీ, కాల్‌ క్వాలిటీ వంటి నెట్‌వర్క్‌ సంబంధ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే బిల్లింగ్‌ పారదర్శకత, కాల్‌ సెంటర్‌తో అనుసంధానం, అందుబాటులో ఔట్‌లెట్ల వంటి సర్వీస్‌ విషయాలనూ కస్టమర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే కాల్‌ సెంటర్‌కు లైన్‌ కలిసే అవకాశమే ఉండడం లేదు. యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని టెలికం కంపెనీలు చెబుతున్నా అంతిమంగా పరిష్కారం అయ్యే చాన్స్‌ తక్కువ. వినియోగం కంటే మొబైల్‌ బిల్లు ఎక్కువగా ఉందని భావించే కస్టమర్లు మెరుగైన ప్యాకేజీ కోసం ఆపరేటర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ ప్రత్యేకత ఏమంటే వినియోగదారు మరో రాష్ట్రానికి (టెలికం సర్కిల్‌) మారినా వినియోగిస్తున్న నంబరు మారకపోవడం. ఈ అంశం కస్టమర్లకు ఆయుధంగా మారింది. టెలికం కంపెనీని మార్చిన 90 రోజులకు మరో ఆపరేటర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉండడం వినియోగదార్లకు కలిసి వస్తోంది. You may be interested

70.78 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 24th September 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 15 పైసలు బలపడి 70.78 వద్ద ప్రారంభమైంది. పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతవరణం, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడం వంటి కారణాల వలన గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.03 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కానీ దేశీయ ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ నిధుల ఇన్‌ఫ్లో భారీగా జరగడంతో పాటు ముడి చమురు ధరలు తగ్గడంతో

ఐసీఐసీఐ బ్యాంక్‌ శాఖల విస్తరణ వేగవంతం

Tuesday 24th September 2019

మార్చి 2020 నాటికి 450 చిన్న శాఖలు 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టింది. ప్రస్తుతం ఉన్న శాఖల్లో 10వ వంతు నూతన శాఖల ఏర్పాటుకు సిద్ధమైంది.  వచ్చే ఏడాది మార్చి నాటికి నూతనంగా 450 చిన్న శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్థేశించుకున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం నెట్‌వర్క్‌ 5,300 వద్దకు చేరుకుంటుందని సోమవారం వెల్లడించింది. శాఖల ఏర్పాటుతో

Most from this category