News


కరెన్సీ మార్పిడి రేట్లు సరిగ్గా ఉండేలా ఐఎంఎఫ్‌ చూడాలి

Saturday 27th July 2019
news_main1564205046.png-27355

  • అమెరికా వంటి దేశాలకు సంబంధం లేదు
  • ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

న్యూఢిల్లీ: కరెన్సీ మార్పిడి రేట్లు సక్రమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పై ఉంది తప్పితే అమెరికా వంటి దేశాలపై లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ఒక దేశం మరో దేశంపై కరెన్సీ మానిప్యులేషన్‌ (కృత్రిమంగా రేట్లను ప్రభావితం చేయడం) ఆరోపణలు చేయడం ద్వైపాక్షిక ఆధిపత్యం కోసం అన్నట్టుగా ఉన్నాయని పేర్కొన్నారు. చైనా, భారత్‌ దేశాలను కరెన్సీ మానిప్యులేటర్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలో సంకేతాలు ఇచ్చిన విషయం గమనార్హం. ‘‘ఉమ్మడిగా బహుళ విధానాలు, కార్యాచరణల ద్వారా క్రమబద్ధమైన మార్పిడి రేట్లు ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. చెల్లింపుల సదుపాయాలు అన్నవి ద్వైపాక్షిక ఆధిపత్యంలో భాగంగా మారిపోరాదు. కొన్ని దేశాలు కరెన్సీ మానిప్యులేటర్లు అంటూ ఇతర దేశాలను ఎలా పిలుస్తాయి? ఈ తరహా ముద్ర వేయడం ద్వైపాక్షిక అంశాలు కానేకారాదు. ఐఎంఎఫ్‌ సహా ఎన్నో ఇనిస్టిట్యూషన్లు ఈ బాధ్యతను చూసేందుకు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ తరహా సంస్థలను మరింత బలోపేతం చేయడం దీనికి మెరుగైన మార్గంగా దాస్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ డాలర్ల కొనుగోల్లపై గతంలో సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ... అమెరికా ట్రెజరీ విభాగం ఇటీవల కాంగ్రెస్‌కు సమర్పించిన కరెన్సీ నివేదికలో భారత్‌ను కరెన్సీ మానిప్యులేటర్‌గా పేర్కొనకపోవడం గమనార్హం. 
కలసి సాగాలి...
ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రపంచ వృద్ధి క్షీణతపై వస్తున్న ఆందోళనల పట్ల స్పందించారు. మందగమన ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా మానిటరీ, ద్రవ్య విధానాల పరంగా మరింత సహకారంతో కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆర్థిక పరంగా అంతర్జాతీయ సహకారం తగ్గినట్టు దాస్‌ చెప్పారు. దశాబ్ద కాలం క్రితం నాటి తక్కువ వడ్డీ రేట్ల విధానాలు ఇప్పటికీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో కొనసాగుతుండడం, భారత్‌ వంటి వర్ధమాన దేశాలకు సవాలుగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు జారీ చేసిన బాండ్లలో 13 బిలియన్‌ డాలర్ల మేర ప్రతికూల రాబడుల్లో(ఈల్డ్స్‌) ఉన్నట్టు చెప్పారు.You may be interested

యాక్సిస్‌ నుంచి మనీ మార్కెట్‌ ఫండ్‌

Saturday 27th July 2019

ముంబై: యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘యాక్సిస్‌ మనీ మార్కెట్‌ ఫండ్‌’ను ఆవిష్కరించింది. ఇన్వెస్టర్ల స్వల్ప కాల అవసరాల కోసం ఉద్దేశించిన నిధులను సమర్థవంతంగా ఈ పథకం కింద నిర్వహిస్తామని సంస్థ తెలిపింది. ఇది ఓపెన్‌ఎండెడ్‌ పథకం. పెట్టుబడులను మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. నూరు శాతం పెట్టుబడులను ఏఏఏ రేటింగ్‌ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ పథకం శుక్రవారం ఆరంభం కాగా, ఆగస్ట్‌ 1 వరకు సబ్‌స్క్రిప్షన్‌

గరిష్ఠ స్థాయికి ‘వినియోగదారుల ఫైనాన్సింగ్‌ బూమ్‌’

Saturday 27th July 2019

భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం, వినియోగ సంబంధిత రంగాలపై దీని ప్రభావం అంతర్జాతీయ పెట్టుబడిదారులను అతి జాగ్రత్త పరులను చేసిందని జెఫెరీస్, ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ తన వారంతపు ఇన్వెస్టర్‌ నోట్‌ గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌లో పేర్కొన్నారు. భారతదేశంలో ‘వినియోగదారుల ఫైనాన్సింగ్ బూమ్’ గరిష్ట స్థాయికి చేరుకుందని హెచ్చరించారు. ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలలో ఈ బ్యాంక్‌ రుణ వృద్ధి రేటు 3.3 శాతం

Most from this category