News


మార్చి వరకు అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై: ప్రసాద్‌

Thursday 26th December 2019
news_main1577329524.png-30440

రేవారి (హర్యానా): భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం హర్యానాలోని రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది లక్ష్యం. భారత్‌నెట్‌ సేవలను ప్రోత్సహించేందుకు గాను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ 2020 మార్చి వరకు ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నాం. భారత్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన మొత్తం గ్రామాల్లో ప్రస్తుతానికి 48,000 గ్రామాల్లో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వెల్లడించారు. 



You may be interested

జీఎస్‌టీ ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీలు

Thursday 26th December 2019

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపుదారులకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 18న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ 38వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్‌టీకి సంబంధించి, అలాగే, పన్ను చెల్లింపుదారుల సాధారణ ఫిర్యాదుల పరిష్కారం కోసం నిర్మాణాత్మక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కౌన్సిల్‌ భావించినట్టు బుధవారం విడుదలైన ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలియజేసింది. రాష్ట్రాల

సౌర విద్యుత్‌పై ఎన్టీపీసీ దృష్టి

Thursday 26th December 2019

రూ. 50,000 కోట్ల పెట్టుబడి 2022 నాటికి 10 గి.వా. సామర్థ్యం పెంపు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ 2022 నాటికి మరో 10 గిగావాట్ల మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గ్రీన్ బాండ్స్ ద్వారా ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సౌర విద్యుత్ సహా ఎన్‌టీపీసీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 920

Most from this category