News


చమురు- 2 రోజుల్లో 40 శాతం ఆవిరి

Monday 9th March 2020
news_main1583736449.png-32359

ఇంట్రాడేలో 30 శాతం కుప్పకూలిన ధరలు
ఉత్పత్తిలో కోతలకు రష్యా వెనకడుగు
8 డాలర్ల డిస్కౌంట్‌ ప్రకటించిన సౌదీ అరేబియా
ఏడేళ్ల గరిష్టానికి బంగారం ధరలు 

ప్రపంచ చమురు దేశాలకు షాక్‌నిస్తూ సౌదీ అరేబియా ధరలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో నేటి(ఆదివారం అర్ధరాత్రి) ట్రేడింగ్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 1991 తదుపరి ఒక్క రోజులోనే 30 శాతం పతనమయ్యాయి. వెరసి గల్ఫ్‌ వార్‌ తదుపరి భారీ స్థాయిలో నష్టపోయాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 26 శాతంపైగా పడిపోయి 33.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ బ్యారల్‌ 27 శాతంపైగా దిగజారి 30.07 డాలర్ల వద్ద కదులుతోంది. వెరసి ఒక్కో బ్యారల్‌ ధర సుమారు 13 డాలర్ల చొప్పున పడిపోయాయి. గత ఆరేళ్లలో ఇవి కనిష్టంకాగా.. అమెరికాలో పుట్టి ప్రపంచ దేశాలకు షాక్‌నిచ్చిన సబ్‌ప్రైమ్‌ సంక్షోభ సమయంలో అంటే 2008 జులైలో ముడిచమురు ధరలు బ్యారల్‌ 147 డాలర్లను తాకిన విషయం విదితమే.

ఏం జరిగిందంటే?
ఇటీవల నేలచూపులతో కదులుతున్న చమురు ధరలను నిలబెట్టేందుకు వారాంతాన మరోసారి ఒపెక్‌ దేశాలు సమావేశాన్ని నిర్వహించాయి. తద్వారా రోజుకి 1.5 మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో తాజా కోతలకు ప్రతిపాదించాయి. దీనిలో 0.5 మిలియన్‌ బ్యారళ్లమేర రష్యా ఉత్పత్తిని తగ్గించవలసి ఉంటుంది. నిజానికి రెండేళ్లుగా సౌదీ అరేబియా అధ్యక్షతన ఒపెక్‌ దేశాలతోపాటు.. రష్యా సైతం రోజుకి 2.2 మిలియన్‌ బ్యారళ్ల చొప్పున ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ప్రతిపాదనలకు రష్యా అంగీకరించలేదు. దీంతో ఉన్నట్టుండి సౌదీ అరేబియా చమురు సరఫరాల ధరలలో 6-8 డాలర్లమేర డిస్కౌంట్‌ను ప్రకటించింది. గత రెండు దశాబ్దాలలోనే ఇది అత్యధికంకాగా.. ప్రపంచం‍లోనే చమురు ఉత్పత్తికి రెండో పెద్ద దేశమైన సౌదీఅరేబియా.. ఉత్పత్తిని సైతం పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో గల్ఫ్‌లో చమురు ధరల యుద్ధానికి తెరలేచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి 1991లో గల్ఫ్‌ వార్‌ సమయం‍లో నమోదైన స్థాయిలో చమురు ధరలు ఒక దశలో 30 శాతంపైగా కుప్పకూలాయి. యూరోపియన్‌ దేశాలకు సౌదే అరామ్‌కో సరఫరా చేసే చమురుపై బ్యారల్‌కు 10 డాలర్ల డిస్కౌంట్‌ను ప్రకటించింది. వెరసి సౌదే అరామ్‌కో షేరు ఐపీవో ధర కంటే దిగువకు పతనమైంది.

కరెన్సీల పతనం
చమురు, స్టాక్స్‌ పతనంకావడంతోపాటు బాండ్లకు డిమాండ్‌ పెరగడంతో అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ ఒక దశలో 0.5 శాతం స్థాయికి పడిపోయాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ బాండ్ల ఈల్డ్స్‌ సైతం సరికొత్త కనిష్టాలను తాకాయి. ఈ ప్రభావంతో డాలరుతో మారకంలో నార్వే క్రోన్‌ విలువ 1980 తదుపరి కనిష్టానికి చేరగా.. మెక్సికన్‌ పెసో 7 శాతం తిరోగమించింది. అయితే రక్షణాత్మక పెట్టుబడిగా పేరున్న జపనీస్‌ యెన్‌ 2016 స్థాయికి బలపడింది. 102.48ను తాకింది. యూరో సైతం 1 శాతం పుంజుకుని 1.139కు చేరింది. కాగా.. బంగారం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) 1700 డాలర్లను అధిగమించాయి. ఇవి ఏడేళ్ల గరిష్టంకాగా.. ఇంతక్రితం 2012 డిసెంబర్‌లో పసిడి ధరలు ఈ స్థాయిలో మెరిశాయి!!You may be interested

నేటివార్తల్లోని షేర్లు

Monday 9th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ఎస్‌బ్యాంక్‌లో బాండ్లరూపంలో రూ.662 కోట్లరూపాయల  బాకీ  మాత్రమే ఉందని, ఎటువంటి టర్మ్‌లోన్‌లు లేవనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.   ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌: అదనపు టైర్‌-1 ఇన్‌స్ట్రుమెంట్‌ ద్వారా నిధులు సమీకరించాలనే ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు ఇండస్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. సెయిల్‌: ఇండియన్‌ రైల్వేస్‌కు 15.5 లక్షల టన్నుల స్టీల్‌ను సరఫరా చేసే ఆర్డర్‌ కోసం ఇండియన్‌

నేడు భారీ గ్యాప్‌డౌన్‌తో ఓపెనింగ్‌!

Monday 9th March 2020

ప్రపంచ మార్కెట్లలో కరోనా సునామీ 301 పాయింట్లు కుప్పకూలిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  శుక్రవారం యూఎస్‌ మార్కెట్‌ 1 శాతం మైనస్‌ ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల జోరు నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 301 పాయింట్లు పడిపోయి 10,627 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 10,928 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌

Most from this category