News


అమెరికా నుంచి భారీ చమురు దిగుమతులు

Saturday 28th September 2019
news_main1569646971.png-28600

  • ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 72 శాతం అప్‌
  • మొదటి స్థానం ఇరాక్‌దే
  • మొత్తంగా తగ్గిన దిగుమతులు

న్యూఢిల్లీ: అమెరికా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి ఐదు నెలలూ- ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ చూస్తే, (2018 ఇదే కాలంతో పోల్చి) చమురు దిగుమతులు 72 శాతం పెరిగాయి. అయితే చమురు దిగుమతుల విషయంలో మొదటి స్థానంలో ఇరాక్‌ నిలిచింది.  భారత్‌ సాంప్రదాయకంగా మధ్యప్రాశ్చ్య దేశాల నుంచే భారీగా చమురు దిగుమతులు చేసుకుంటూ వస్తోంది. అమెరికా నుంచి దిగుమతుల భారీ పెరుగుదలను చూస్తే... సమీప కాలంలో చమురు దిగుమతల విషయంలో దేశం ప్రాధాన్యత మారే అవకాశాలు కనిపిస్తున్నాయన్నది విశ్లేషణ.  డైరెక్టరేట్‌ జనలర్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ నుంచి అందిన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే.... 2018 ఏప్రిల్-ఆగస్టు మధ్య భారత్‌కు అమెరికా నుంచి చమురు దిగుమతుల పరిమాణం 2.6 మిలియన్‌ టన్నులు. అయితే 2019 ఇదే కాలంలో ఈ పరిమాణం 4.5 మిలియన్‌ టన్నులకు ఎగసింది. 

  • ఇరాక్‌ మాత్రం ఈ జాబితాలో మొదటి వరుసలో కొనసాగుతోంది. దేశం చమురు అవసరాల్లో నాల్గవవంతు (25 శాతం) తీరుస్తోంది మాత్రం ఇరాక్‌. ఇరాక్‌ నుంచి దిగుమతులు 18.99 మిలియన్‌ టన్నుల నుంచి 21.24 మిలియన్‌ టన్నులకు (12 శాతం) ఎగశాయి. 
  •  మొత్తం ఈ కాలంలో దిగుమతులు మాత్రం 93.91 మిలియన్‌ టన్నుల నుంచి 91.24 మిలియన్‌ టన్నులకు తగ్గాయి. 
  • నిజానికి భారత్‌కు అత్యధికంగా చమురు ఎగుమతులు చేస్తున్న దేశంగా సౌదీ అరేబియా ఉండేది. 2017-18లో ఈ స్థానాన్ని ఇరాక్‌ ఆక్రమించింది. ప్రస్తుతం రెండవ స్థానంలో కొనసాగుతున్న సౌదీ అరేబియా నుంచి దిగుమతులు 15.66 మిలియన్‌ టన్నుల నుంచి 17.74 మిలియన్‌ టన్నులకు పెరిగింది. 
  • ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆదేశం నుంచి భారత్‌కు మే తర్వాత చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీనితో దిగుమతులు ఒక్కసారిగా 13.3 మిలియన్‌ టన్నుల నుంచి 2 మిలియన్‌ టన్నులకు పడిపోయాయి. 
  • ఇరాన్‌ స్థానాన్ని నైజీరియా భర్తీచేసింది. ఈ ఆఫ్రికా దేశం నుంచి చమురు దిగుమతులు 5.81 మిలియన్‌ టన్నుల నుంచి 7.17 మిలియన్‌ టన్నులకు ఎగశాయి. 
  • ఇక నాల్గవ స్థానంలో 6.4 మిలియన్‌ టన్నులతో యునైటెడ్‌ అరబ్‌ నిలిచింది. 
  • 6.17 మిలియన్‌ టనునలతో వెనుజువేలాది ఐదవ స్థానం. తరువాతి స్థానాల్లో కువాట్‌ (4.2 మిలియన్‌ టన్నులు) మెక్సికో (3.3 మిలియన్‌ టన్నులు) ఉన్నాయి. -
  • అమెరికా నుంచి దిగుమతులను చూస్తే, 2017-18లో సరఫరాలు 1.4 మిలియన్‌ టన్నులు. 2018-19 నాటికి ఈ పరిమాణం నాలుగు రెట్లు పెరిగి 6.4 మిలియన్‌ టన్నులకు చేరింది. 



You may be interested

యుఎస్‌ ఎక్సేంజ్‌ల నుంచి చైనా కంపెనీల డీలిస్టింగ్‌?

Saturday 28th September 2019

యుఎస్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ల నుంచి చైనా కంపెనీలను డీ లిస్టింగ్‌ చేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే వార్తల నేపథ్యంలో శుక్రవారం యుఎస్‌ మార్కెట్‌లు భారీగా నష్టపోయాయి. చైనా కంపెనీలలోకి యుఎస్‌ పెట్టుబడులు వెళ్లకుండా ఉండేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఈ చర్యను తీసుకోనుందని పరిశీలకులు తెలిపారు. ఈ చర్య వలన గత ఏడాది కాలం నుంచి కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తిరిగి పుం‍జుకున్నాయని విశ్లేషకులు తెలిపారు. కాగా

కన్సాలిడేషన్‌ దశలో నిఫ్టీ

Saturday 28th September 2019

నిఫ్టీ 50 శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ప్రారంభమైనప్పటికి 11,600 స్థాయి వద్ద నుంచి  వెనుతిరిగింది. చివరికి రోజువారి చార్టులో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచి 11,500 సమీపంలో ముగిసింది. గత సెషన్‌లో నిఫ్టీ 58.80 పాయింట్లు కోల్పోయి 11,512 వద్ద క్లోజయిన విషయం తెలిసిందే. ‘‘స్వల్పకాలానికి గాను ​‘పతనమయినప్పుడు కొనుగోలు చేయడమనే’ వ్యూహాన్ని నిఫ్టీ విషయంలో అనుసరించడం మంచిది. పోజిషన్స్‌ తీసుకునే ట్రేడర్లు నిఫ్టీ 11,400-11,380 స్థాయి వద్ద కొత్తగా లాంగ్‌పోజిషన్‌లను తీసుకోవచ్చు. ఎగువన

Most from this category