News


మాంద్యం ముదిరితే మరింత ముప్పు !

Saturday 7th September 2019
news_main1567831322.png-28251

  • మరో పది లక్షల ఉద్యోగాలకు ఎసరు 
  • జీఎస్‌టీ తగ్గించాలి
  • మరిన్ని ఉద్దీపన చర్యలు
  • కోరుతున్న వాహన పరిశ్రమ 

న్యూఢిల్లీ: వాహన రంగంలో నెలకొన్న ప్రస్తుత మందగమనం ఇలాగే కొనసాగితే, మరిన్ని ఉద్యోగాలు పోతాయని వాహన పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మరిన్ని సామాజిక పరిణామాలు చోటు చేసుకుంటాయని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా హెచ్చరించారు. అందుకని ప్రభుత్వం తక్షణం జీఎస్‌టీ తగ్గింపు వంటి  ఉద్దీపన చర్యలు ప్రకటించాలని ఆయన అభ్యర్థించారు.  భారత్‌ స్టేజ్‌-సిక్స్‌ పర్యావరణ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్నాయని, ఈ నిబంధనల కారణంగా వాహనాల ధరలు మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు. దీంతో మందగమనం మరింతగా ముదురగలదన్న భయాలను ఆయన వ్యక్తం చేశారు. 2008, 2014లో ఇలాగే మందగమన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం పన్ను రాయితీల రూపంలో ఉద్దీపన చర్యలు తీసుకుందని, ఫలితంగా డిమాండ్‌ పుంజుకుందని వాధేరా గుర్తు చేశారు. కాగా వాహన రంగ సంబంధిత విధానాలను రూపొందించి, ఖరారు చేసేందుకు ఒకే నోడల్‌ ఏజెన్సీ ఉండాలని ఆయన కోరారు. వాహనాలపై ప్రస్తుతం 28 శాతంగా ఉన్న జీఎస్‌టీ రేటును 18 శాతానికి తగ్గించాలని వాహన పరిశ్రమ ఎప్పటినుంచో కోరుతోంది. 

జీఎస్‌టీపై స్పష్టతనివ్వండి ..! 
భారత వాహన పరిశ్రమ వృద్ధి కధ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని టాటా మోటార్స్‌ ఎమ్‌డీ, సీఈఓ గుంటర్‌ బుశ్చెక్‌  ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల సెంటిమెంట్‌ కనిష్ట స్థాయికి పడిపోవడం, రుణాల లభ్యత దుర్లభం కావడం తదితర అంశాలు దీనికి కారణాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలను ఆయన స్వాగతించారు. సమస్యలు కొనసాగుతున్నప్పటికీ, పరిశ్రమ టర్న్‌ అరౌండ్‌ కాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలన్నా, పండుగ సీజన్‌లో అమ్మకాలు పుంజుకోవాలన్నా జీఎస్‌టీ, పాత వాహనాల తొలగింపు తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని పేర్కొన్నారు. బీఎస్‌-సిక్స్‌ నిబంధనలకు మారడం అతి పెద్ద విపరిణామమని వివరించారు. దీని కారణంగా వాహనాల తయారీ ప్లాంట్లు, నిల్వలు, సప్లై చెయిన్‌.. మొత్తంగా వాహన పరిశ్రమ తీవ్రమైన కుదుపునకు గురైందని తెలిపారు. పరిశ్రమ వృద్ధి బాటలో ఉంటే ఇది ఒక సమస్య కాకపోయేదని, కానీ మందగమనంలో ఉండటంతో ఇది మరింత ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. కాగా వాహన రంగం మరికొన్ని నెలల్లో కోలుకోలేని పక్షంలో మరిన్ని ఉద్యోగాలు పోతాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎమ్‌డీ, పవన్‌ గోయెంకా వ్యాఖ్యానించారు.

వాహన కంపెనీలు ఇప్పటికే 15,000 తాత్కాలిక ఉద్యోగులను తొలగించాయి. గత మూడు నెలల్లో దాదాపు 300 డీలర్షిప్‌లు మూతపడగా, దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఉద్యోగులను డీలర్లు తొలగించారు. మాంద్యం కొనసాగితే మరో పది లక్షల ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు నెలకొన్నాయి. 
 



You may be interested

బీఎస్‌-6కు మారడం సవాలే

Saturday 7th September 2019

బీఎస్‌-సిక్స్‌కు మారడం సవాళ్లతో కూడుకున్నదే  జీఎస్‌టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి  సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వాధేరా  న్యూఢిల్లీ: భారత్‌ స్టేజ్‌-సిక్స్‌ (బీఎస్‌-6) నిబంధనలకు వాహన రంగం సజావుగా మారడానికి ప్రభుత్వం తగిన విధంగా తోడ్పాటునందించాలని సియామ్‌ కోరింది. బీఎస్‌-సిక్స్‌  నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తున్నా,  బీఎస్‌-సిక్స్‌ ఇంధనాల లభ్యత విషయమై  ఆందోళన ఉందని సియామ్‌(సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటో మాన్యుఫాక్చరర్స్‌) ప్రెసిడెంట్‌ రాజన్‌ వాధేరా చెప్పారు. ఇక్కడ జరిగిన ఏసీఎమ్‌ఏ(ఆటోమోటివ్‌

రెండేళ్లలో పేటీఎం ఐపీఓ!

Saturday 7th September 2019

- స్టార్టప్‌లకు ఇది స్వర్ణయుగం - పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ వెల్లడి ముంబై: ఆన్‌లైన్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) సన్నాహాలను మరో రెండేళ్లలో ప్రారంభించనున్నది. తమ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కావడం తప్పనిసరి అని, అయితే ఇంతవరకూ దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోలేదని పేటీఎమ్‌ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మవివరించారు. స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాకముందే మరింతగా నగదు నిల్వలను ఆర్జించాల్సి ఉందని పేర్కొన్నారు. సింగపూర్‌లో

Most from this category