News


వాడని కార్డులు 16 తర్వాత.. ఆన్‌లైన్‌లో పనిచేయవు!

Saturday 7th March 2020
news_main1583575277.png-32353

 ఇప్పటిదాక ఒక్కసారికూడా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఉపయోగించని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు,​ కాంటాక్ట్‌లెస్‌ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు. ప్రస్తుత కాలంలో లావాదేవీలన్నీ డిజిటల్‌ కావడంతో వేగంగా పనులు జరిగిపోతున్నాయి. దాదాపు 70 శాతం మంది  ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు జరుపుతూ తమపనులను ఇట్టే పూర్తిచేసుకుంటున్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ ఆర్థిక మోసాలు అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) 2020 మార్చి 16 నాటికి ఒక్కసారికూడా ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపని క్రెడిట్‌, డెబిట్ కార్డులు, కాంటక్ట్‌లెస్‌ కార్డులు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరపకుండా తాత్కాలికంగా నిలిపివేయమని చెబుతూ జనవరి 15న ఒక నోటిఫికేషన్‌ను జారీచేసింది. దీని ప్రకారం క్రెడిట్‌ గానీ డెబిట్‌ కార్డు కలిగిన వారు ఇప్పటిదాక వాటిని వాడకుండా ఉన్నట్లయితే మార్చి 16 తర్వాత అవి ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయడానికి వీలుకాదు. అంతేకాకుండా షాపుల్లో మనం చెల్లింపులకు వినియోగించే పీఓఎస్‌ కార్డులు (కాంటాక్ట్‌లెస్‌ కార్డులు) కూడా ఒక్కసారికూడా వాడకపోతే ఇన్‌యాక్టివ్‌ అవుతాయి. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ 2007 చట్టంలోని సెక‌్షన్‌ 10(2) ప్రకారం  ఈ నిర్ణయం తీసుకున్నట్లు  ఆర్బీఐ నోటిఫికేషన్‌లో  వెల్లడించింది. గత కొన్నేళ్లుగా చాలా రంగాల్లో డెబిట్‌,క్రెడిట్‌ కార్డుల వాడకం  బాగా పెరిగిపోయింది.కార్డ్స్‌ ద్వారా జరిపే లావాదేవీలకు మరింత సెక్యూరిటీ ఇవ్వడంతోపాటు లావాదేవీలు సక్రమంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కాగా ప్రిపెయిడ్‌ గిఫ్ట్‌ కార్డులు(మెట్రోరవాణాలో వాడే కార్డులు) దీని పరిధిలోకి రావు.
 You may be interested

ఇక బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీల కన్సాలిడేషన్‌!

Saturday 7th March 2020

రానున్న దశాబ్ద కాలంలో నాణ్యమైన కంపెనీలకే పెద్దపీట మొబైల్‌, సోషల్‌ మీడియా కారణంగానే కరోనా భయాల వ్యాప్తి కరోనాతో టైటన్‌, నెస్లే, దివీస్‌, జీఎంఎం తదితరాలకు డిమాండ్‌ -సౌరభ్‌ ముఖర్జియా, మార్సెలస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ దేశీయంగా గతంలోనూ యస్‌ బ్యాంక్‌ తరహా సమస్యలు తలెత్తాయి. యస్‌ బ్యాంక్‌ వ్యహారంపై కొద్ది నెలలుగా అనిశ్చితి కొనసాగుతూనే వచ్చింది. ఆలస్యమైనప్పటికీ చివరికి యస్‌ బ్యాంక్‌ సమస్యల అనిశ్చితికి చెక్‌ పడిందంటున్నారు మార్సెలస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకులు, సీఐవో సౌరభ్‌ ముఖర్జియా.

ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ప్రసక్తే లేదు: ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌

Saturday 7th March 2020

ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ప్రసక్తే లేదని, కేవలం వాటాను మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు  ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్పష్టతనిచ్చారు. యస్‌బ్యాంక్‌ లో నియంత్రణ వాటాను ఎస్‌బీఐ కొనుగోలు చేసే అంశంపై రజనీష్‌ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్‌బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్‌ స్కీంపై స్పందించేందుకు తమకు సోమవారం వరకు గడువు ఉందని రజనీష్‌ తెలిపారు. మెండిబకాయిలతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించిన డ్రాప్ట్‌ స్కీంపై

Most from this category