News


ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

Wednesday 7th August 2019
news_main1565155111.png-27594

న్యూయార్క్‌: ఐఫోన్‌ యూజర్లు ‘ఆపిల్ కార్డ్’ సేవలను ఈ మంగళవారం నుంచి వినియోగించుకోవచ్చని టెక్ దిగ్గజం ఆపిల్ ప్రకటించింది. వాలెట్‌ యాప్‌ నుంచి క్రెడిట్‌ కార్డ్‌ కావాలని దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ భాగస్వామ్యంతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ.. ఆపిల్‌ బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ సేవలను తొలుత అమెరికాలో ప్రారంభించనున్నట్లు వివరించింది. వీలైనన్ని సైన్‌-అప్స్‌ను పెంచడం ద్వారా కార్డు సేవలను విస్తరించాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపింది. సాధ్యమైనంత వరకు ఫీజుల భారాన్ని తగ్గించివేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఆపిల్ పే యాప్‌లో అభివృద్ధిచేసిన డిజిటల్‌ క్రెడిట్‌ కార్డు వినియోగంపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది. కార్డు ఆధారంగా సునాయాసంగా డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వీలు ఉందని, యూజర్లు ఫిజికల్‌ కార్డు కావాలని కోరితే కొంత రుసుము వసూలుచేసి కార్డును ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. వెబ్‌సైట్‌ ఆప్షన్‌ లేదని స్పష్టంచేసింది. కార్డు నెంబర్‌, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్‌ వంటి సంప్రదాయ ఫిజికల్‌ క్రెడిట్‌ కార్డ్‌ల మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగిపోయే అధునాతన డిజిటల్‌ కార్డును ఐఫోన్‌ వినియోగదారులకు అందించనున్నామని ఈ ఏడాది మార్చిలోనే కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. You may be interested

ఆర్‌బీఐ రేట్ల కోత ఎంత?

Wednesday 7th August 2019

రుతుపవనాల లోటు తగ్గుతుండడం, చమురు ధరల పతనం, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం వలన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జరుపుతున్న ద్రవ్య పరపతి విధాన సమావేశంలో స్వల్పకాలిక రుణ రేటు, రెపో రేటును 25-50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్‌) తగ్గించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ బృందం నిర్ణయం బుధవారం వెలువడనుంది. దేశియ ఆర్థిక మం‍దగమనాన్ని తగ్గించేందుకు వరుసగా నాలుగోసారి రేట్ల కోతకు

నిర్మాణ రంగంలోనూ ద్వైపాక్షికం

Wednesday 7th August 2019

భారత్‌తో వాణిజ్య బంధం ఇంకా పెరగాలి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆకాంక్ష హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండియా – ఇజ్రాయిల్‌ దేశాల మధ్య ఇన్నాళ్లుగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో మాత్రమే ద్వైపాక్షి వాణిజ్యం జరిగిందని, ఇక నుంచి సాంకేతికత, మౌలిక, నిర్మాణ రంగాల్లో బలపడాల్సిన అవసరముందని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో మాదిరిగా మౌలిక, నిర్మాణ రంగంలోనూ సాంకేతికత, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ), రోబోటిక్స్‌ వంటి ఆధునిక టెక్నాలజీ

Most from this category