News


క్రెడాయ్‌ రియాల్టీ పురస్కారాలు..28న

Friday 20th December 2019
news_main1576811143.png-30318

  • క్రిసిల్‌ సంస్థద్వారా ప్రాజెక్టుల పనితీరు పరిశీలన

నిర్మాణ రంగంలో నాణ్యతతో పాటు వినియోగదారుడి భద్రతకు పెద్దపీట వేసిన డెవలపర్‌ను ప్రోత్సహించేందుకే పురస్కారాలను ఆరంభించినట్లు కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలంగాణ శాఖ ఛైర్మన్‌ గుమ్మి రామిరెడ్డి, అధ్యక్షుడు సీహెచ్‌ రామచంద్రారెడ్డి చెప్పారు. గురువారమిక్కడ విలేకరులతో వారు మాట్లాడారు. ఈ నెల 28న క్రియేట్‌-2019 పేరిట హైదరాబాద్‌ ‘జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌’లో క్రెడాయ్‌ తెలంగాణ రియాల్టీ పురస్కారాలను అందజేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌ హాజరవుతారని, మొత్తం 13 విభాగాల్లో 103 నామినేషన్లు వచ్చాయని వారు తెలియజేశారు. రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ద్వారా ఆయా ప్రాజెక్టుల లొకేషన్‌, గ్రీనరీ, నాణ్యత, వినియోగదారుడి భద్రతను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా అవార్డులకు ఎంపిక జరుగుతుందని తెలియజేశారు. 
ఏపీలో మూడు రాజధానులు సరైన నిర్ణయమే..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాజధానుల విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని క్రెడాయ్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు. విలేకరులడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... అమరావతితో పాటు కర్నూలు, విశాఖలో రాజధానులు వస్తే మరింత పురోగతి సాధ్యపడుతుందన్నారు. సమావేశంలో క్రెడాయ్‌ కార్యదర్శి ప్రేమ్‌సాగర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు కె.ఇంద్రసేనా రెడ్డి, జి.అజయ్‌కుమార్‌, కోశాధికారి బి.పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. You may be interested

టెలికం.. లైన్‌ కట్‌ అవుతోంది..

Friday 20th December 2019

ట్రాయ్‌ తక్షణం జోక్యం చేసుకోవాలి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యలు ఏఆర్‌పీయూ రూ.300కు చేరవచ్చని అంచనా న్యూఢిల్లీ: అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం.. అన్నీ కలిసి టెలికం పరిశ్రమను కోలుకోలేనంతగా కుదేలెత్తిస్తున్నాయని టెల్కో దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తక్షణమే జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. ఇటు పెట్టుబడులు అటు

వ్యాపార ని‘‘బంధనాలు’’ తొలగించండి

Friday 20th December 2019

స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉండాలి విలీనాలు, కొనుగోళ్లకు నిబంధనల అవరోధం తొలగించాలి కేంద్ర ఆర్థిక మంత్రికి పారిశ్రామికవేత్తల వినతి న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారాలను మరింత సులభంగా నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కేంద్రాన్ని కోరారు. 2020-21 బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌, అసోచామ్‌ ప్రెసిడెంట్‌ బాలకృష్ణ గోయెంకా తదితర

Most from this category