News


ఫార్మాకు ‘‘కోవిడ్‌’’ ఫీవర్‌!!

Wednesday 19th February 2020
news_main1582081851.png-31910

  • పెరగనున్న ముడివస్తువుల రేట్లు
  • ఆందోళనలో ఔషధ రంగం
  • తోడ్పాటు చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా

న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాలకు విస్తరించిన కరోనావైరస్ సెగ దేశీ ఫార్మా పరిశ్రమకు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చైనాలో పరిస్థితులు గానీ సత్వరం చక్కబడకపోతే ఔషధాల్లో ఉపయోగించే ముడివస్తువుల రేట్లు గణనీయంగా పెరగవచ్చని ఫార్మా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. "ఇదే పరిస్థితి కొనసాగితే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) ధరలు పెరిగిపోతాయి" అని జైడస్ గ్రూప్ చైర్మన్ పంకజ్ పటేల్ వెల్లడించారు. 2018-19 గణాంకాల ప్రకారం.. భారత సంస్థలు దిగుమతి చేసుకునే బల్క్‌ డ్రగ్స్‌లో సింహభాగం 67.56 శాతం వాటా చైనాదే ఉంది. కరోనా వైరస్‌కు సంబంధించి తాజా పరిస్థితులపై ఫార్మాతో పాటు టెక్స్‌టైల్స్‌, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ హార్డ్‌వేర్‌, సోలార్, ఆటో, సర్జికల్ ఎక్విప్‌మెంట్స్‌, పెయింట్స్ తదితర రంగాల ప్రతినిధులు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. దేశీ పరిశ్రమలపై కరోనావైరస్ ప్రతికూల ప్రభావాలు పడకుండా చూసేందుకు ప్రభుత్వం త్వరలో తగు చర్యలు ప్రకటిస్తుందని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. 

ఆందోళన వద్దు: నిర్మలా సీతారామన్ ...
కీలక ముడివస్తువుల దిగుమతుల్లో జాప్యం వల్ల ఫార్మా, కెమికల్‌, సౌర విద్యుత్ పరికరాల రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, కరోనావైరస్ కారణంగా ధరల పెరుగుదల గురించి ఆందోళన అక్కర్లేదని ఆమె చెప్పారు. ఔషధాలు, మెడికల్ పరికరాల కొరత లేదన్నారు. కొన్ని ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఫార్మా పరిశ్రమ కోరుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, దేశీ ఫార్మా సంస్థలకు ఏపీఐల సరఫరాపై కరోనావైరస్ ప్రభావాల మీద ఫార్మా విభాగం (డీవోపీ) అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనాలో నూతన సంవత్సర సెలవుల కారణంగా గత 20-25 రోజులుగా సరఫరా ఆగిపోయిందని పేర్కొన్నాయి. ఔషధాల ఉత్పత్తికి అవసరమైన బల్క్‌ డ్రగ్స్‌ కోసం భారత ఫార్మా సంస్థలు ఎక్కువగా చైనా మీదే ఆధారపడుతున్నాయి. 


రెండు మూడు నెలల స్టాక్‌ మాత్రమే ఉంది: ఔషధాల ముడిసరుకుపై ఐపీఏ వెల్లడి
హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత ఔషధ పరిశ్రమ వద్ద రెండు మూడు నెలలకు సరిపడ మాత్రమే యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌ నిల్వలు ఉన్నాయని ఇండియా ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) వెల్లడించింది. చైనా నుంచి ఏటా రూ.17,000 కోట్ల విలువైన ముడి సరుకు (ఏపీఐ) భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ఆ దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్టు ఐపీఏ సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ తెలిపారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఏం జరుగుతుందో ఊహించే పరిస్థితి లేదు. రెండు మూడు నెలలకు సరిపడ మాత్రమే నిల్వలున్నాయి. చైనాలో ప్రస్తుతం సెలవులు పొడిగించారు. మార్చి మొదటి వారం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందని భావిస్తున్నాం. చైనా నుంచి మార్చి మొదటి వారంలో ఇక్కడికి సరఫరా మొదలైతే గండం నుంచి గట్టెక్కుతాం. పరిస్థితి సర్దుమణుగుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడే అంచనా వేయలేం. ప్రతిరోజు సమీక్షిస్తున్నాం. యూరప్‌ నుంచి ఏపీఐ దిగుమతులపై భారత పరిశ్రమ దృష్టిసారించొచ్చు’ అని వివరించారు. బయో ఆసియాలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. భారత్‌లో కొత్తగా ఏపీఐ తయారీ యూనిట్లకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. తద్వారా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని ఆయన వ్యాఖ్యానించారు. You may be interested

యాపిల్‌కు ‘‘వైరస్‌’’

Wednesday 19th February 2020

చైనాలో తగ్గిన తయారీ, డిమాండ్‌  ఆదాయ అంచనాలు అందుకోలేం  వెల్లడించిన యాపిల్‌ కంపెనీ  శాన్‌ఫ్రాన్సిస్కో/క్యూపర్టినో:  కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ ప్రభావం ఆపిల్‌ కంపెనీపై పడింది. ఈ మార్చి క్వార్టర్‌లో ఆదాయ అంచనాలను అందుకోలేమని ఐఫోన్స్‌ తయారు చేసే యాపిల్‌ కంపెనీ సోమవారం వెల్లడించింది. ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా చైనాలో ఐఫోన్‌ల తయారీ దెబ్బతిన్నదని, ఫలితంగా తగిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌లను సరఫరా చేయలేమని తెలిపింది. అంతేకాకుండా చైనాలో యాపిల్‌ స్టోర్స్‌ను కొన్ని రోజులు మూసేశామని,

ఎల్‌ఐసీ ఐపీఓకు రావడం మంచిదే !

Wednesday 19th February 2020

ఈ ప్రతిపాదనేదీ ఇప్పటివరకూ రాలేదు  వెల్లడించిన ఐఆర్‌డీఏఐ చైర్మన్‌  ముంబై: ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు సంబంధించిన ప్రతిపాదన ఏదీ  ప్రస్తుతానికైతే తమ వద్దకు రాలేదని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్‌డీఏఐ తెలిపింది. పారదర్శకత, ఇతర అంశాల దృష్ట్యా చూస్తే, ఎల్‌ఐసీ ఐపీఓకు  రావడం మంచి ప్రయత్నమేనని ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ ఎస్‌.సి. కుంతియా పేర్కొన్నారు. అసలు ప్రతీ బీమా కంపెనీ కూడా స్టాక్‌ మార్కెట్లో లిస్టయితే మంచిదని వివరించారు. బీమా పాలసీల్లో ఇన్వెస్ట్‌

Most from this category