News


యాపిల్‌కు ‘‘వైరస్‌’’

Wednesday 19th February 2020
news_main1582082151.png-31911

  • చైనాలో తగ్గిన తయారీ, డిమాండ్‌ 
  • ఆదాయ అంచనాలు అందుకోలేం 
  • వెల్లడించిన యాపిల్‌ కంపెనీ 

శాన్‌ఫ్రాన్సిస్కో/క్యూపర్టినో:  కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ ప్రభావం ఆపిల్‌ కంపెనీపై పడింది. ఈ మార్చి క్వార్టర్‌లో ఆదాయ అంచనాలను అందుకోలేమని ఐఫోన్స్‌ తయారు చేసే యాపిల్‌ కంపెనీ సోమవారం వెల్లడించింది. ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా చైనాలో ఐఫోన్‌ల తయారీ దెబ్బతిన్నదని, ఫలితంగా తగిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌లను సరఫరా చేయలేమని తెలిపింది. అంతేకాకుండా చైనాలో యాపిల్‌ స్టోర్స్‌ను కొన్ని రోజులు మూసేశామని, అమ్మకాలు, డిమాండ్‌ కూడా తగ్గాయని వివరించింది. స్టోర్స్‌ను కొన్నింటిని తెరచినప్పటికీ, కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిపింది. ఈ అంశాలన్నీ ఆదాయంపై ప్రభావం చూపగలవని పేర్కొంది. ఆదాయ అంచనాలను అందుకోలేమని స్పష్టం చేసింది. ఈ మార్చి క్వార్టర్‌లో ఆదాయం 6,300 కోట్ల డాలర్ల నుంచి 6,700 కోట్ల డాలర్ల మేర (రూ4.5-4.7 లక్షల కోట్లు)ఆదాయం రాగలదని యాపిల్‌ అంచనా వేసింది. ఐఫోన్‌లు అత్యధికంగా అమ్ముడయ్యే అతి పెద్ద మూడో మార్కెట్‌ చైనాయే. చైనా కాకుండా ఇతర మార్కెట్లలో అమ్మకాలు పటిష్టంగా ఉన్నాయని యాపిల్‌ పేర్కొంది. 

కరోనా వైరస్‌ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు త్వరలోనే నెలకొనగలవని అంచనా వేశామని, ఈ అంచనాలు తప్పాయని పేర్కొంది. కాగా కరోనా కాటు యాపిల్‌పైనే కాకుండా ఇతర దిగ్గజ కంపెనీలపై కూడా పడింది. యాపిల్‌ సరఫరాదారు ఫాక్స్‌కాన్‌, వాహన దిగ్గజం టయోటా, స్పోర్ట్స్‌వేర్‌ కంపెనీలు నైకీ, ఆడిడాస్‌లు కూడా తమ ఆదాయంపై కరోనా ప్రభావం ఉండగలవని పేర్కొన్నాయి. 
 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌?..నిఫ్టీ అవరోధాలు 12046, 12,100

Wednesday 19th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 56 పాయింట్లు ప్లస్‌  మంగళవారం యూఎస్‌ మార్కెట్లు డీలా నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా(గ్యాపప్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం  8.30 ప్రాంతం‍లో 69 పాయింట్లు పుంజుకుని 12,075 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,006 పాయింట్ల  వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాలో

ఫార్మాకు ‘‘కోవిడ్‌’’ ఫీవర్‌!!

Wednesday 19th February 2020

పెరగనున్న ముడివస్తువుల రేట్లు ఆందోళనలో ఔషధ రంగం తోడ్పాటు చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాలకు విస్తరించిన కరోనావైరస్ సెగ దేశీ ఫార్మా పరిశ్రమకు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చైనాలో పరిస్థితులు గానీ సత్వరం చక్కబడకపోతే ఔషధాల్లో ఉపయోగించే ముడివస్తువుల రేట్లు గణనీయంగా పెరగవచ్చని ఫార్మా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. "ఇదే పరిస్థితి కొనసాగితే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) ధరలు పెరిగిపోతాయి" అని జైడస్

Most from this category