News


కరోనా ఎఫెక్ట్‌: ఫ్లిప్‌కార్ట్‌ సేవలు నిరవధిక వాయిదా

Wednesday 25th March 2020
news_main1585130860.png-32675

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన సేవల్ని నిరవధికంగా వాయిదా వేసింది. కరోనా వ్యాధి నివారణ చర్యలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మంగళవారం అర్థరాత్రి నుంచి మరో 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఈయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ తమ కార్యాకలాపాలతో పాటు మంగళవారం రాత్రి నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లను స్వీకరించడం కూడా నిలిపివేసింది. ఏప్రిల్‌2 వరకు తమ మౌలిక సదుపాయాల సెంటర్లను మూసివేస్తున్నామని, ఆర్డర్లను తీసుకోవడం ఆపేసామని, తరువాత వివిధ కేటగిరీలుగా విభజించి సమీక్షిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్ష్‌ మీనన్‌ వెల్లడించారు. అమెజాన్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఫ్లిప్‌కార్ట్‌ పూర్తి సేవల్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.
 
మరోవైపు అమెజాన్‌ మాత్రం నిత్యవసర ఉత్పత్తుల సరఫరాను కొనసాగిస్తూ, నిత్యవసరాలు కాని ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లకు క్యాన్సిల్‌ సదుపాయాన్ని కల్పిస్తూ, కస్టమర్లకు రిఫండ్‌ను ఆఫర్‌ చేస్తుంది.  

 కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతుండడంతో భారత ప్రభుత్వం వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఎక్కడిక్కడ ప్రజలు, వాహనాలు నిలిచిపోవడంతో జనజీవనం స్తభించిపోయింది. కాగా బిగ్‌బాస్కెట్,గ్రోఫర్స్‌ వంటివి గత వారం నుంచే ఆర్డర్లను తీసుకోవడం నిలిపివేశాయి. అయితే నిత్యవసరాలను డెలివరీ చేయడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఈ కామర్స్‌ సైట్లు ఈ నిర్ణయానికి వచ్చాయి. 



You may be interested

చైనాలో పరిశ్రమలు పునఃప్రారంభం

Wednesday 25th March 2020

ప్రపంచమంతా కరోనా వైరస్‌ కల్లోలంతో విలవిలాడుతుంటే..మరో పక్క చైనాలో మాత్రం పరిశ్రమలు తెరుచుకుని పనులు ప్రారంభిస్తున్నాయి. యూరప్, యూఎస్, ఇండియా, లాటిన్‌ అమెరికా వంటి దేశాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా పుట్టిన చైనాలో మాత్రం ఇందుకు భిన్న వాతావరణం నెలకొంది. చైనాలో పరిస్థితులు కాస్తంత చక్కబడడంతో  కంపెనీలన్నీ క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఆ దేశంలో కరోనా కేసులు తగ్గడం, కొత్త కేసులు కూడా నమోదవకపోవడంతో ఆ దేశంలోని తయారీ పరిశ్రమలు

మూడోసారి సెన్సెక్స్‌ టార్గెట్‌ను తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 25th March 2020

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ సెన్సెక్స్‌ టార్గెట్‌ను వరుసగా మూడోసారి తగ్గించింది. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తితో కారణంగా ఈ ఏడాది సెన్సెక్స్‌ టార్గెట్‌ను 32000గా నిర్ణయించింది. గతంలో ఇదే బ్రోకరేజ్‌ సంస్థ సెన్సెక్స్‌కు టార్గెట్‌ 36000గా కేటాయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం 2021లో సెన్సెక్స్‌ ఈపీస్‌ వృద్ధి అంచనాల ప్రకారం కేటాయించిన టార్గెట్‌ 10శాతం పరిధిలో ఉండొచ్చు. ఈ టార్గెట్‌ ధర ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 20శాతం

Most from this category