News


ఎకానమీకి కరోనా కాటు..

Thursday 12th March 2020
news_main1583990244.png-32424

  • నివారణ చర్యలతో వృద్ధికి 2 శాతం విఘాతం
  • బ్రోకరేజి సంస్థ బార్‌క్లేస్ నివేదిక

ముంబై: దేశీయంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎకానమీకి గట్టి దెబ్బే తగలనుంది. వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు సామూహిక క్వారంటైన్‌ వంటి ముందుజాగ్రత్త చర్యలతో ఆర్థిక వృద్ధిపై 2 శాతం మేర ప్రతికూల ప్రభావం పడవచ్చని బ్రిటీష్ బ్రోకరేజి సంస్థ బార్‌క్లేస్‌ హెచ్చరించింది. ప్రజలు బైట తిరగడాన్ని తగ్గించుకోవడం, వినియోగ వ్యయాలు.. పెట్టుబడులు.. సేవా రంగ కార్యకలాపాలు తగ్గిపోవడం వంటివి వృద్ధి సాధనకు రిస్కులుగా పరిణమించగలవని పేర్కొంది. అయితే, ముడిచమురు ధరలు భారీగా క్షీణించడం భారత్‌కు కలిసొచ్చే అంశంగా బార్‌క్లేస్ తెలిపింది. చమురు దిగుమతుల భారం తగ్గడమనేది.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి కనీసం 0.50 శాతం దాకానైనా దోహదపడగలదని వివరించింది. భారత వృద్ధి రేటు అంచనాలను బార్‌క్లేస్ ఇటీవలే 6.5 శాతం నుంచి 5.6 శాతానికి కుదించింది. భారత వృద్ధి మరింత మందగిస్తుందేమోనని క్లయింట్లలో ఆందోళన నెలకొన్నట్లు బార్‌క్లేస్ తెలిపింది. అయితే, దేశీయంగా డిమాండ్ ఆధారిత ఎకానమీ కావడం, చమురు ధరల కరెక్షన్‌తో లబ్ధి పొందే అవకాశాలు భారత్‌కు అనుకూలాంశాలని వివరించింది. వృద్ధికి ఊతమిచ్చేలా ద్రవ్య విధానాలు ఉండటం కూడా సానుకూలమని, సరఫరా వ్యవస్థలు మెరుగ్గానే ఉన్నాయని పేర్కొంది. You may be interested

మల్కాపూర్‌లో ఐఓసీఎల్‌ భారీ టెర్మినల్‌

Thursday 12th March 2020

రూ.611 కోట్ల పెట్టుబడులతో 70 ఎకరాల్లో నిర్మాణం 18 నెలల్లో పూర్తి; 1.80 లక్షల కిలో లీటర్ల సామర్థ్యం రూ.36 కోట్లతో చర్లపల్లి ఎల్‌పీజీ ప్లాంట్‌ విస్తరణ కూడా.. ఇండియన్‌ ఆయిల్‌ ఈడీ శ్రవణ్‌ ఎస్‌ రావు వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) రూ.3,800 కోట్ల పెట్టుబడులతో చేపడుతున్న పారదీప్‌ – హైదరాబాద్‌ డీజిల్‌ ఎగ్జాస్ట్‌ ఫ్లూయిడ్‌ (డీఈఎఫ్‌) పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ తుది దశకు చేరుకుంది. ఈ పైప్‌లైన్‌కు అనుసంధానిస్తూ

భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌

Thursday 12th March 2020

రూపొందించిన సెలెస్ట్రియల్‌   హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ను హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సెలెస్ట్రియల్‌ ఈ-మొబిలిటీ రూపొందించింది. వినియోగానికి వీలున్న నమూనాను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. ఉద్యానవనాలకు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు రవాణాకు వీలుగా 6 హెచ్‌పీ సామర్థ్యంతో తయారు చేశారు. 21 హెచ్‌పీ డీజిల్‌ ట్రాక్టరుకు సమానంగా ఇది పనిచేస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సిద్దార్థ దురైరాజన్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ధర రూ.5

Most from this category