News


తుది ఫలితాలపైనే కార్పొరేట్ల దృష్టి

Tuesday 21st May 2019
news_main1558421385.png-25854

  • ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆచితూచి స్పందన

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారుకు మరో దఫా అధికారం ఖాయమంటూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై కార్పొరేట్ వర్గాలు ఆచితూచి స్పందించాయి. మే 23న తుది ఫలితాలొచ్చేదాకా వేచి చూడాలని అవి భావిస్తున్నాయి. కీలకమైన ఫిక్కీ, సీఐఐ, అసోచాం మొదలైన పరిశ్రమ సమాఖ్యలు ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించేందుకు నిరాకరించాయి. అయితే, ఆనంద్ మహీంద్రా వంటి కొందరు కార్పొరేట్ దిగ్గజాలు తమదైన శైలిలో ఎగ్జిట్‌ పోల్స్‌, ఫలితాలపై వ్యాఖ్యలు చేశారు. ఈ వారంలో ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిణామాలేమిటంటూ మహీంద్రా గ్రూప్ చీఫ్ ఎకానమిస్టు సచ్చిదానంద్ శుక్లా చేసిన ట్వీట్‌పై గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.  "ఈ వారంలో అందరి దృష్టి ఆ 'ఒక్క' అంశంపైనే ఉంటుంది" అంటూ పరోక్షంగా మే 23న ఫలితాలే కీలకంగా ఉండబోతున్నాయని పరోక్షంగా హింట్ ఇచ్చారు. 

కొత్త ప్రధాని పేరు N అక్షరంతో ప్రారంభం...
ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ హర్ష్ గోయెంకా కూడా ఎగ్జిట్‌ పోల్స్‌పై చమత్కార ధోరణిలో స్పందించారు. "పోల్స్‌ను బట్టి చూస్తే రాబోయే ప్రధాని పేరు ఆంగ్ల అక్షరం ఎన్‌ తో ప్రారంభమవుతుంది అన్నది మాత్రం ఖాయంగా తెలుస్తోంది" అంటూ మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఇక, "దేశ ప్రజలంతా ఓటరు అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీకి మరో దఫా అధికారం ఇవ్వాలని ఓటర్లు భావించిన పక్షంలో అదే జరుగుతుంది" అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. సరైన సందర్భం అనుకున్న ప్రతిసారీ భారతీయ ఓటరు.. ప్రభుత్వాలను మార్చేయడమో లేదా అదే ప్రభుత్వానికి మరోసారి అవకాశమివ్వడమో చేస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు. ఒకవేళ ఓటర్ల అభీష్టం మేరకు రెండో దఫా కూడా మోదీయే ప్రధానైతే.. దేశ ఎకానమీకి కూడా మంచిదే కావొచ్చేమోనని తల్వార్ పేర్కొన్నారు. "ఇప్పటిదాకా అమలైన సంస్కరణలు, ప్రవేశపెట్టాల్సిన సంస్కరణలు చాలానే ఉన్నాయని పరిశ్రమ ప్రతినిధిగా నేను భావిస్తున్నాను. ఇది ఒక నిర్ణయాత్మక ప్రభుత్వం. మన దేశం వచ్చే ఐదేళ్లలో 7 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే సంస్కరణలు కొనసాగాలి" అని చెప్పారు. 



You may be interested

టాటా మోటార్స్‌ లాభం 49 శాతం డౌన్‌

Tuesday 21st May 2019

రూ.1,109 కోట్ల ప్రకటన న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం తగ్గి రూ.1,109 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,175 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.91,643 కోట్ల నుంచి రూ.87,285 కోట్లకు తగ్గింది. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్‌గా రూ.28,724 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఆదాయం రూ.3,04,903 కోట్లుగా

టాటామోటర్స్‌ షేర్లకు క్యూ4 ఫలితాల షాక్‌..!

Tuesday 21st May 2019

6.50శాతం నష్టపోయిన షేర్లు  గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాలు నిరాశపరడంతో టాటా మోటర్స్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 5శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో రూ.186.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. టాటామోటర్స్‌ అనుబంధ సం‍స్థ జేఎల్‌ఆర్‌ మోటర్స్‌ కారణంగా క్యూ4లో కంపెనీ నికర లాభం 49శాతం తగ్గి రూ.1,109 కోట్లకు పరిమితమైంది. గతేడాది క్యూ4లో  మొత్తం ఆదాయం రూ.91,643 కోట్లు నమోదవగా, ఈ క్యూ4లో రూ.87,285 కోట్లకు పరిమితమైంది.

Most from this category