News


ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు

Tuesday 24th September 2019
news_main1569298080.png-28510

  • కార్పొరేట్‌ పన్ను కోతపై జెఫరీస్‌ నివేదిక
  • ప్రభావం పరిమితమేనని అభిప్రాయం

ముంబై: కార్పొరేట్‌ పన్నును కేంద్ర ప్రభుత్వం ఒకేసారి గణనీయంగా తగ్గించినప్పటికీ... భారీగా పడిపోయిన ఆటోమొబైల్‌ వాహన డిమాండ్‌ పునరుద్ధరణపై పరిమిత ప్రభావమే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ అభిప్రాయపడింది. కంపెనీలపై 10-12 శాతం పన్నును తగ్గించడం వల్ల అంతిమంగా 1-2 శాతం వరకే ఉత్పత్తులపై తగ్గింపునకు అవకాశం ఉంటుందని ఈ సంస్ధ తన నివేదికలో పేర్కొంది. దీనికి బదులు ప్రభుత్వం జీఎస్‌టీ 10 శాతం తగ్గింపును ఆఫర్‌ చేసి ఉంటే, అప్పుడు కంపెనీలకు మేలు జరిగేదని, అవి ఉత్పత్తులపై 7-8 శాతం వరకు (ఆన్‌రోడ్డు ధరలు) తగ్గించేవని తెలిపింది. ఆటోమొబైల్‌ రంగం రెండు దశాబ్దాల కాలంలోనే అత్యంత ప్రతికూల పరిస్థితులను చవిచూస్తున్న విషయం గమనార్హం. దీంతో వాహన రంగంపై 28 శాతంగా ఉన్న జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పుడున్న క్లిష్టమైన ఆదాయ పరిస్థితుల్లో రేటు తగ్గింపు సాధ్యం కాదని జీఎస్‌టీ ఫిట్‌మెంట్‌ కమిటీ అభిప్రాయానికి రావడంతో అది సాధ్యపడలేదు. పడిపోతున్న అమ్మకాలతో ఉత్పత్తిని కూడా సంస్థలు కుదించుకుంటున్నాయి. కొంత మంది ఉద్యోగులను తొలగించే పనిని కూడా చేపడుతున్నాయి. హీరో మోటోకార్ప్‌ ఇప్పటికే తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రకటించింది.
పండుగలకు డిమాండ్‌ పెద్దగా పెరగకపోవచ్చు...
రానున్న పండుగల సీజన్‌లో వాహనాలకు డిమాండ్‌ పెద్దగా పెరగకపోవచ్చన్న అభిప్రాయాన్ని జెఫరీస్‌ వ్యక్తం చేసింది. మొదటి విడత పండుగల విక్రయాలను పరిశీలించగా, మహారాష్ట్ర, కేరళలో డిమాండ్‌ బలహీనంగా ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. దీంతో కంపెనీలు అమ్మకాల కోసం మరింత మొత్తంలో తగ్గింపును ఆఫర్‌ చేయాల్సి రావచ్చని, రెండో త్రైమాసికం ఆదాయాలపై ఇది ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. 



You may be interested

రూ. 7,000 పైకి మారుతి

Tuesday 24th September 2019

కేం‍ద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ చర్యను ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు భారీస్థాయిలో ర్యాలీ చేశాయి. డిమాండ్‌ తగ్గడంతో పాటు లిక్విడిటీ కొరత వలన భారీ స్థాయిలో దిద్దుబాటుకు గురయిన దేశీయ వాహన కంపెనీలు తిరిగి పుంజుకోడం ప్రారంభించాయి. ఈ దశలో గత రెండు సెషన్‌లలో మారుతీ సుజుకీ

ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలకు రెపోనే ప్రాతిపదిక

Tuesday 24th September 2019

ఎస్‌బీఐ ప్రకటన అక్టోబర్‌ 1 నుంచీ అమలు ముంబై: తమ చర వడ్డీ (ప్లోటింగ్‌) రుణాలు అన్నింటికీ రెపో రేటే ప్రామాణికంగా ఉంటుందని ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.4 శాతంగా ఉంది.  ఆర్‌బీఐ

Most from this category