కార్పొరేట్ పన్ను కోత సంస్కరణల దిశగా సంకేతం
By Sakshi

హైదరాబాద్: కార్పొరేట్ పన్ను తగ్గింపు అన్నది నిర్మాణాత్మక సంస్కరణల దిశగా ప్రభుత్వం ఇచ్చిన సంకేతమని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ అన్నారు. రెవెన్యూలోటును పూడ్చుకునేందుకు పన్నేతర ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వృద్ధి రేటు తగ్గినందున జీఎస్టీ వసూళ్లు కూడా తగ్గుతాయని అంచనా వేసిందేనన్నారు. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.91వేల కోట్లకు తగ్గిపోయిన విషయం గమనార్హం. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడారు. ‘‘2004 నుంచి 2014 వరకు ఎటువంటి నిర్మాణాత్మక సంస్కరలను చేపట్టలేదు. 2014 నుంచి 2019 వరకు బ్యాంక్రప్టసీ కోడ్, జీఎస్టీ వంటి సంస్కరణలను అమలు చేయడం జరిగింది. కనుక నిర్మాణాత్మక సంస్కరణలపై మనం దృష్టి సారించాల్సిన సమయం ఇది’’ అని కేవీ సుబ్రమణియన్ అన్నారు.
You may be interested
58 డాలర్ల దిగువకు క్రూడ్ ఆయిల్!
Thursday 3rd October 2019యుఎస్ స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో చమురు డిమాండ్ ఆందోళనలు పెరిగాయి. దీనికితోడు గత వారానికి సంబంధించి యుఎస్ చమురు నిల్వలు అంచనాల కంటే పెరిగాయని ఎనర్జి ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం ప్రకటించడంతో గురువారం చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.3 శాతం నష్టపోయి బారెల్ 57.52 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీ క్రూడ్ 0.2 శాతం నష్టపోయి బారెల్ 52.55 డాలర్లకు పడిపోయింది. గత సెషన్లో
సైబర్ మోసాలపై టెకీల పోరు
Thursday 3rd October 2019ఎంఎంటీ, స్విగీ, జొమాటో, పేటీఎం జట్టు ఆర్బీఐతో భేటీ మోసాల నివారణ చర్యలపై సమీక్ష టెల్కోలు, గూగుల్‌తో కూడా చర్చలు బెంగళూరు: సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్ సేవల సంస్థలు మేక్మైట్రిప్ గ్రూప్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్.. మొబైల్ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ మొదలైనవి ఇందుకోసం జట్టు