News


భారత్‌లో పెట్టుబడుల వరద

Monday 23rd September 2019
news_main1569210898.png-28478

  • యాపిల్‌ వంటి కంపెనీల చూపు భారత్‌ వైపు 
  • వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు లేదు 
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో భారత్‌లో పెట్టుబడుల వరద పారనున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలతో పోల్చితే మన దేశంలోనే పన్ను తక్కువగా ఉందని, ఫలితంగా పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయమైన దేశంగా నిలుస్తుందని  వివరించారు. 

చైనా కంటే భారత్‌ మేలు...
గతంలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ అధికంగా ఉండేదని, మరికొన్ని కారణాల వల్ల భారత్‌ పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమైందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌కోత కారణంగా ఐఫోన్‌లు తయారు చేసే యాపిల్‌ కంపెనీ వంటి భారీ సంస్థలకు  భారత్‌ ఆకర్షణీయ పెట్టుబడుల దేశంగా నిలవనున్నదిని పేర్కొన్నారు. కొత్తగా ‍కంపెనీలు ఏర్పాటు చేస్తే, పన్ను 15 శాతమేనని, ఇంత తక్కువ పన్ను   ఏ దేశంలో లోనూ లేదని వివరించారు. పన్నులు, పారదర్శకత, ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి విషయాల్లో చైనా కంటే భారత్‌ ఇప్పుడు మెరుగ్గా ఉందని, ఇప్పుడు అందరూ భారత్‌ వైపు చూస్తారన్న నిపుణుల వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. చైనాలో 25 శాతం పన్ను ఉండగా, భారత్‌లో 15 శాతమే పన్ను ఉందని, దీంతో చైనా కంటే భారతే మేలని యాపిల్‌ కంపెనీ భావిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి నుంచి కార్పొరేట్‌ ట్యాక్స్‌ను పెంచడం కష్ట సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని చెప్పారు. 

ఆర్థిక మందగమనాన్ని నిలువరించి వ్యవస్థలో వృద్ధి జోష్‌ను పెంచడానికి కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 10 శాతం మేర ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే.దీంతో కార్పొరేట్‌ ట్యాక్స్‌ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గింది. గత 28 ఏళ్లలో ఇదే అత్యంత భారీ సంస్కరణ అని నిపుణులంటున్నారు. రూ.1.45 లక్షల కోట్ల పన్ను రాయితీల కారణంగా ప్రైవేట్‌ పెట్టుబడుల జోరు పెరిగి 45 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగసిన నిరుద్యోగం దిగిరాగలదన్న అంచనాలున్నాయి. 



You may be interested

దివాలా అంచుల్లో థామస్‌ కుక్‌

Monday 23rd September 2019

లభించని ప్రైవేట్‌ పెట్టుబడులు ​బ్రిటిష్‌ ప్రభుత్వ సాయం కోసం చూపు   ప్రభుత్వ సాయం కష్టమేనంటున్న నిపుణులు ల‍ండన్‌: బ్రిటిష్‌ పర్యాటక సంస్థ, థామస్‌ కుక్‌ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది.  ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్‌

సెన్సెక్స్‌ 38,380 స్థాయిని అధిగమిస్తే....

Monday 23rd September 2019

కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతవరకూ దోహదపడుతుందో చెప్పలేముగానీ, కార్పొరేట్‌ కంపెనీలు...ముఖ్యంగా 30 శాతంపైన పన్ను బ్రాకెట్‌లో వున్నవాటి లాభాలు తక్షణం​పెరిగిపోతాయి. ఆ కంపెనీలు ఏమీ చేయకుండానే, వ్యవస్థలో డిమాండ్‌ పెరక్కుండానే ఆ కంపెనీల లాభాలు, ఈపీఎస్‌లు 20 శాతం వరకూ ఎగిసిపోతాయన్న వాస్తవాన్ని గ్రహించడంతో గత శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ర్యాలీ జరిపింది. ఆయా కంపెనీల రీరేటింగ్‌

Most from this category