News


పెట్టుబడుల వృద్ధికే కార్పొరేట్‌ పన్ను కోత: సీఈఏ

Tuesday 10th December 2019
news_main1575950096.png-30144

న్యూఢిల్లీ: పెట్టుబడులు పుంజుకోవడమే లక్ష్యంగా కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని కేం‍ద్రం తీసుకున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన ఫిక్కీ యంగ్‌ లీడర్స్‌ సదస్సులో సుబ్రమణియన్‌ మాట్లాడుతూ... ఆర్థిక వృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు ఎంతో కీలకమైనవన్నారు. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించడం తెలిసిందే. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ తరవాత ప్రారంభించి 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే కొత్త తయారీ రంగ కంపెనీలకు కనిష్టంగా 15 శాతం రేటును వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం వెంటనే ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకువచ్చిన ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు- 2019కు ఇటీవలే పార్లమెంటు ఆమోదముద్ర కూడా పడింది. దీని ప్రకారం కొన్ని సంస్థలను నెగిటివ్‌ జాబితాలో ఉంచారు. ఈ జాబితాలో ఉంచిన సంస్థలు తయారీ రంగం పరిధిలోనికి రావని, వీటికి కనిష్ట 15 శాతం బేస్‌ రేటు వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో  మైనింగ్‌ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌​డెవలపర్లు, బుక్‌ ప్రింటర్లు ఉన్నట్లు వివరణిచ్చింది. వీటితోపాటు స్లాబ్స్‌లో వినియోగించే మార్బుల్‌ బ్లాక్స్‌, సిలిండర్‌లోకి గ్యాస్‌ రీఫిల్లింగ్‌, సినీమాటోగ్రాఫ్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కూడా నెగిటివ్‌ లిస్ట్‌లో ఉన్నాయి. 



You may be interested

భారత్‌ కంపెనీలపై వివక్ష వద్దు: కేంద్రం

Tuesday 10th December 2019

న్యూఢిల్లీ: భారత్‌ కంపెనీలపై వివక్ష  ప్రదర్శించవద్దని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి ధోరణిని అవలంబించే దేశాల కంపెనీలకూ భారత్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని న్యూఢిల్లీలో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన హెచ్చరించారు. ‘‘ఏదైనా దేశం తమ దేశంలో కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో భారత్‌ కంపెనీలపై వివక్ష చూపిస్తే, సంబంధిత దేశ కంపెనీలను కూడా  భారత్‌ పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌

కాఫీడే టెక్‌ పార్క్‌ విక్రయానికి యస్‌ బ్యాంకు బ్రేక్‌!

Tuesday 10th December 2019

బెంగళూరు: కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్‌ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్‌ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్‌ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై

Most from this category