STOCKS

News


టారిఫ్‌లపై దూకుడు వద్దు!!

Tuesday 18th June 2019
news_main1560836972.png-26369

  • ట్రంప్‌కు అమెరికా కంపెనీల సూచన
  • వినియోగదారులపై ధరల భారం
  • కంపెనీల వ్యాపార అవకాశాలకు నష్టం
  • పోటీలో నిలవలేమంటూ ఆందోళనలు

వాషింగ్టన్‌: చైనా ఉత్పత్తులన్నింటిపైనా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించగా... ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా పరోక్షంగా అమెరికా కంపెనీలు, వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి కంపెనీలు దేశాధ్యక్షుడిని హెచ్చరించాయి. చైనా నుంచి దిగుమతయ్యే 250 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే టారిఫ్‌లను పెంచేసింది. ఓ ఒప్పందానికి రాకపోతే మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కూడా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరిక. ఇలా చేస్తే బాణాసంచా ధరలు పెంచాల్సి వస్తుందని, తద్వారా వ్యాపారాన్ని కోల్పోవాల్సి వస్తుందని న్యూ హాంప్‌షైర్‌ ఫైర్‌వర్క్స్‌ అనే కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, దీనివల్ల అమెరికాలోని చిన్న పట్టణాల్లో జూలై 4 నాటి స్వాతంత్య దినోత్సవ సందర్భంగా బాణాసంచా సంబరాలను రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఈ కంపెనీ హెచ్చరించింది. ఇక మిన్నెసోటాకు చెందిన ఓ మోటార్‌సైకిల్‌ కంపెనీ కూడా... చైనా విడిభాగాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ప్రత్యర్థి కంపెనీలు తమ వ్యాపారాన్ని ఎత్తుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. లాస్‌ ఏంజెలిస్‌కు చెందిన గృహోపకరణాల డిజైనర్‌, పంపిణీ కంపెనీ అయితే, ఉద్యోగ నియమకాలను నిలిపేయాల్సి వస్తుందని, అలాగే, గిడ్డంగుల భారీ విస్తరణ ప్రణాళికలు కూడా ఆలస్యం అవుతాయని పేర్కొంది. 
పోటీలో నిలవలేం...
చైనా నుంచి అమెరికాకు వచ్చే ప్రతి ఉత్పత్తిపైనా 25 శాతం టారిఫ్‌లు విధించే ప్రతిపాదనపై ట్రంప్‌ ప్రభుత్వం అభిప్రాయాలను కోరగా... టారిఫ్‌లను పెంచే విషయంలో ముందుకు వెళ్లకపోవటమే మంచిదన్న సూచనలు వస్తున్నాయి. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు వివిధ వర్గాల అభిప్రాయాలను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించనుంది. ఇప్పటికే వందలాది కంపెనీలు, వాణిజ్య బృందాలు, వ్యక్తులు అక్కడి ప్రభుత్వానికి లేఖల రూపంలో సూచనలు చేస్తూ... అదనపు టారిఫ్‌ల వల్ల వినియోగదారులపై ధరల భారం పడుతుందని స్పష్టంచేశారు. లాభాలను కోల్పోవడంతో పాటు అమెరికన్‌ కంపెనీలు, చైనా నుంచి కీలక విడిభాగాలను కొనుగోలు చేసే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పడలేక, వ్యాపార అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందుకే టారిఫ్‌ల విషయంలో పునరాలోచన చేయాలని, లేదంటే కనీసం అమెరికన్‌ వినియోగదారులు, అమెరికన్‌ కంపెనీలకు ఆధారమైన ఉత్పత్తులనైనా టారిఫ్‌ల నుంచి మినహాయించాలని అభ్యర్థించాయి. ‘‘అమెరికా వ్యాపారాల గురించి ఆలోచించండి. చైనా కాదు!!. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను పెంచుతున్నారు కానీ, అంతిమంగా కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులకు బదలాయిస్తున్నాయి’’ అన్న విషయాన్ని తమ అభిప్రాయాల్లో భాగంగా బలంగా తెలియజేశాయి. అమెరికన్‌ కంపెనీల టెక్నాలజీని చైనా కంపెనీలు చౌర్యం చేయకుండా నిరోధించడం, చైనా టెక్నాలజీ కంపెనీలకు అక్కడి ప్రభుత్వం అనుచిత సబ్సిడీలు ఇవ్వకుండా అడ్డుకునే వ్యూహాల్లో భాగంగా అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ చైనాపై ట్రేడ్‌ వార్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పలు విడతలుగా వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు జరిగినప్పటికీ... అమెరికా పెట్టే షరతులకు చైనా తలొగ్గకపోవడమే ఆయా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సమసిపోకపోవడానికి కారణం. You may be interested

జెట్‌ పునరుద్ధరణ ఇక కలే!

Tuesday 18th June 2019

 వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ వేటలో బ్యాంకులు ఫెయిల్‌ దివాలా పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీకి బ్యాంకుల ఏకగ్రీవ నిర్ణయం వచ్చిన ఏకైక బిడ్‌... ఆమోదయోగ్యంగా లేదని ప్రకటన ముంబై: ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటాలు విక్రయించటంపై బ్యాంకులు చేతులెత్తేశాయి. వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించి రెండు నెలల పాటు ఇన్వెస్టర్‌ కోసం అన్వేషించిన రుణదాతల (బ్యాంకులు) కమిటీ... ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. చివరకు బిడ్డింగ్‌లో మిగిలిన ఏకైక సంస్థకు జెట్‌ను విక్రయించడం ఇష్టం

ఎయిర్‌టెల్‌, వొడా ఐడియాలకు రూ.3,050 కోట్ల పెనాల్టీ!

Tuesday 18th June 2019

డిజిటల్‌ కమ్యూనికేసన్‌ కమిషన్‌ ఆమోదముద్ర జియోకు ఇంటర్‌కనెక్షన్‌ పాయింట్లు ఇవ్వని ఫలితం పెనాల్టీ వేసే ముందు ట్రాయ్‌ సూచనలు పరిగణనలోకి న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ కాల్స్‌కు ఇంటర్‌ కనెక్షన్‌ పాయింట్లను సమకూర్చనందుకు గాను భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు భారీ పెనాల్టీ భారం పడింది. టెలికం శాఖ అత్యున్నత నిర్ణయాల విభాగం డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) పెనాల్టీ విధించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే, టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సమస్యల

Most from this category