News


పర్యాటకం ఢమాల్‌..!

Friday 13th March 2020
news_main1584068595.png-32445

  • ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కరోనా ఎఫెక్ట్‌
  • సాధారణ ప్రజానీకానికి నో ఎంట్రీ
  • బిజినెస్‌ విజిటర్లూ అంతంతే
  • నిరాశపర్చిన వింగ్స్‌ ఇండియా

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: రెండేళ్లకోసారి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్‌ ఇండియా సదస్సు, ప్రదర్శనకు కరోనా ఎఫెక్ట్‌ పడింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం గురువారం (మార్చి 12న) ప్రారంభమైన సంగతి తెలిసిందే. విభిన్న విమానాల ప్రదర్శనతో అటు బిజినెస్‌ విజిటర్లనూ, ఇటు సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకునే ఏవియేషన్‌ షో కళ తప్పింది. వింగ్స్‌ ఇండియా షోలో ఎంత కాదన్నా ప్రతిసారి 25-30 విమానాలు, హెలికాప్టర్లు దర్శనమిచ్చేవి. ఈసారి ఈ సంఖ్య ఎనమిదికి పరిమితమైందంటే పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ లోహ విహంగాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా ఉండేది. 2020 వింగ్స్‌ ఇండియా చిన్న విమానాలు, హెలికాప్టర్లతో సర్దుకుపోతోంది. అటు కరోనా భయంతో బిజినెస్‌ విజిటర్ల రాక తగ్గింది. ముఖ్యంగా విదేశీ విజిటర్ల సంఖ్య భారీగా పడిపోయింది. ప్రతిసారి ఎంత కాదన్నా రోజుకు 2,000కిపైగా బిజినెస్‌ విజిటర్లు వచ్చేవారని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈసారి ఈ సంఖ్య 200లలోపు ఉందని చెప్పారు. 
స్టాల్స్‌ కూడా తగ్గాయి...
వింగ్స్‌ ఇండియా కార్యక్రమం ప్రతిసారి ఎంతకాదన్నా 150కిపైగా స్టాల్స్‌తో సందడిగా ఉండేది. ఈసారి 110 స్టాల్స్‌ మాత్రమే ఏర్పాటయ్యాయని నిర్వాహకులు తెలిపారు. సందర్శకుల తాకిడి లేకపోవడంతో చాలా చోట్ల స్టాళ్లు ఖాళీగా కనపడ్డాయి. వింగ్స్‌ ఇండియా సదస్సు, ప్రదర్శనకు మొదటి రెండు రోజులు వ్యాపార వర్గాలకు, తర్వాతి రెండు రోజులు సాధారణ ప్రజానీకానికి అనుమతిచ్చేవారు. కరోనా ఎఫెక్ట్‌తో సాధారణ ప్రజానీకానికి ఈమారు అనుమతించడం లేదు. ప్రధాన కంపెనీలు బిజినెస్‌ టూ బిజినెస్‌ సమావేశాలకు పరిమితమయ్యాయి. మరోవైపు కరోన భయం వెంటాడుతున్నప్పటికీ అందుకు తగ్గ చర్యలు కానరాలేదు. ఎంట్రీ సమయంలో టెంపరేచర్‌ స్క్రీనింగ్‌ ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం. వింగ్స్‌ ఇండియా వెబ్‌సైట్లో మాత్రం పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించారు. కాగా, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్‌ బృందం హెలికాప్టర్లతో, బ్రిటీష్‌ పైలట్లు అయిన మార్క్‌ జెఫరీ బృందం చిన్న విమానాలతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 



You may be interested

'యస్‌'బీఐ ప్రణాళికకు ఓకే..

Friday 13th March 2020

యస్‌ బ్యాంకులో 725 కోట్ల షేర్ల కొనుగోలు రూ. 7,250 కోట్ల ఖరీదు ఆమోదముద్ర వేసిన ఎస్‌బీఐ ఈసీసీబీ ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు తమ ఈసీసీబీ నుంచి అనుమతి వచ్చినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ ప్రణాళిక ప్రకారం యస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ 725 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున

మాంద్యంలోకి వెళ్లిపోయాం

Friday 13th March 2020

భారత్‌ కూడా ఇందులో భాగమే మార్క్‌ మొబియస్‌ అభిప్రాయం న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లడం ఖాయమేనని వర్ధమాన మార్కెట్ల ఫండ్‌ మేనేజర్‌, మార్క్‌ మొబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ మొబియస్‌ అన్నారు. ‘‘మనకు మాంద్యం రాబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సాంకేతికంగా చెప్పాలంటే భారత్‌ సహా ప్రపంచంలో అధిక భాగం మాంద్యంలోనే ఉంది. అలా అని మనం చేతులు పైకెత్తేసి ఓటమిపాలైనట్టు కాదు. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.

Most from this category