News


ఇండియా రేటింగ్స్‌ యథాతథం: ఎస్‌ అండ్‌ పీ

Thursday 13th February 2020
news_main1581591026.png-31769

భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ను యథాతథంగా ‘బీబీబీ-’గా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్స్‌ దిగ్గజం స్టాండర్డ్‌ అండ్‌ఽ పూర్‌ (ఎస్‌ అండ్‌ పీ) గురువారం ప్రకటించింది. భారత్‌ జీడీపీ వృద్ధి వచ్చే రెండు, మూడేళ్లలో క్రమేపీ దీర్ఘకాలిక సగటుస్థాయికి చేరుకుంటుందని ఎస్‌ అండ్‌ పీ అంచనావేసింది. అయితే పెరిగిన ద్రవ్యలోటు, పెరుగుతున్న ప్రభుత్వ రుణాల కారణంగా కొంత అనిశ్చితి వుందని రేటింగ్స్‌ సంస్థ హెచ్చరించింది. భారత్‌ ఆర్థికాభివృద్ధిరేటు 2019-2020లో 5 శాతానికి తగ్గుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 6 శాతానికి పెంజుకుంటుందని అంచనావేస్తున్నట్లు ఎస్‌ అండ్‌ పీ తెలిపింది. 
టెక్నాలజీ సెక్టార్‌పై కరోనా ముప్పు
 కరోనా ప్రభావంతో ప్రపంచ టెక్నాలజీ సెక్టార్‌కు కూడా ప్రమాదం పొంచి ఉందని, ఎస్‌అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సం‍స్థ హెచ్చరించింది. వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో ఆయా దేశాలు ఎక్కడిక్కడ ప్రయాణ పరిమితులను విధించడం, అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ అయిన చైనాలో పరిశ్రమలు మూతపడడంతో టెక్నాలజీ విస్తరణకు భారీ అవరోధాలు ఏర్పడ్డాయని ఎస్‌అండ్‌ పీ తెలిపింది. వైరస్‌ కారణంగా మార్కెట్‌లన్నీ లూనార్‌ న్యూఇయర్‌ వరకు మూతపడి ఫిబ్రవరి 10న తెరుచుకుంటాయనుకుంటే ఇప్పటికీ అక్కడి పరిస్థితులు అదుపులోకి రాలేదని, దీంతో హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్‌ మాన్యూఫాక్చరింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌, సెమీకండక్టర్‌ కంపెనీల ఉత్పత్తులు ఆగిపోవడంతో టెక్నాలజీ రంగం క్షీణిస్తుందని పేర్కొంది. 



You may be interested

ఐడియా నష్టాలు రూ.6,439 కోట్లు

Friday 14th February 2020

ఏజీఆర్‌, తరుగుదల ప్రభావం  5 శాతం తగ్గిన ఆదాయం  న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో నష్టాలు మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.5,005 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.6,439 కోట్లకు చేరాయి. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి)కు సంబంధించిన వడ్డీ వ్యయాలు, ఆస్తులకు సంబంధించిన అధిక తరుగదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌

మళ్లీ కరోనా భయాలు- మార్కెట్లు డీలా

Thursday 13th February 2020

సెన్సెక్స్‌ 106 పాయింట్లు మైనస్‌ 27 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఐటీ, ఫార్మా రంగాల ఎదురీత కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య పెరగుతుండటంతో మరోసారి ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. దీంతో అమెరికా ఇండెక్సుల ఫ్యూచర్స్‌ నీరసించగా.. ఆసియాలోనూ అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించి 41,460 వద్ద నిలవగా.. నిఫ్టీ 27 పాయింట్లు తక్కువగా 12,175

Most from this category