News


కరోనా కాటుకు కుంటుపడ్డ రంగాలు!

Saturday 7th March 2020
news_main1583565453.png-32346

      గత నెలరోజులుగా ఎవరినోటా విన్నా ఒకటే మాట వినిపిస్తోంది అదే కరోనా(కోవిడ్‌-19). చైనాలోని వుహాన్‌ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తూ వేగంగా వ్యాప్తి చెందుతూ పోతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో కరోనా భయంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన పౌరులు, పర్యాటకుల వల్ల ఇండియాలో కూడా ఇప్పటిదాక 30 కరోనా కేసులు నమోదయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిస్థితులు అనిశ్చితంగా ఉండడంతో భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం 348 మిలియన్‌డాలర్ల మేర ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు. అంతేగాకుండా చైనాలో ఉత్పత్తులు మందగించడంతో టాప్‌ 15 ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వల్ల ఇండియాలో ఏయే పరిశ్రమలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్నాయో చూద్దాం.

ఆటో సెక్టార్‌
ఆటో మొబైల్‌ వ్యాపారం చైనాపై విస్తారంగా అధారపడి ఉంది. చైనాలో కోవిడ్‌-19 వ్యాప్తితో ఎక్కడిక్కడ పరిశ్రమలు మూతపడడం, అక్కడనుంచి ఇతర దేశాలకు సరఫరా కావాల్సిన విడిభాగాలను నిషేధించడంతో ఆటో మొబైల్‌ సెక్టార్‌ మందగమనంలో నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఇండియాలో ఉన్న విడిభాగాల నిల్వలు ప్రస్తుతానికి సరిపోయినప్పటికీ, చైనాలో పరిశ్రమలు మరికొద్ది రోజులు ఇలానే మూతపడితే భారత ఆటో ఉత్పత్తులు 8-10 శాతం తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విభాగంలో ఎలక్ట్రిక్‌ వాహానాలు ఎక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్‌ వాహనాలన్నింటికి చైనా నుంచే బ్యాటరీల సరఫరా జరుగుతుంది. బ్యాటరీల ఉత్పత్తి జరగపోతే ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి , విక్రయాలు పడిపోతాయి.

ఫార్మా
ప్రపంచంలో డ్రగ్‌ ఫార్ములేషన్‌ను ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా ఒకటి. అయినప్పటికీ దేశీయ ఫార్మా పరిశ్రమలు ఏపీఐలను భారీగా దిగుమతి చేసుకుంటాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.24,900 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఇండియా దిగుమతి చేసుకుంది. దేశీయంగా వినియోగించే మొత్తం డ్రగ్స్‌లో ఇది 40 శాతంగా ఉంది.ఇక చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఏపీఐ 70 శాతంగా ఉంది. ఒకవేళ చైనా నుంచి సరఫరా అయ్యే ఏపీఐలకు అంతరాయాలు ఏర్పడితే ఊహించని స్థాయిలో మందుల రేట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. చాలా రకాలైన యాంటిబయోటిక్స్‌, యాంటీపైరేటిక్స్‌ కోసం మనం చైనామీద పూర్తిగా ఆధారపడుతున్నాము. ఈ ఏపీఐలను ఉపయోగించి డ్రగ్స్‌ తయారు చేయాలంటే భారీ సామర్థ్యం కలిగిన బాయిలర్స్‌ కావాలి. వీటి తయారీలో కూడా చైనాదే పైచేయి. వీటిని తీసుకొచ్చి మనం డ్రగ్స్‌ తయారు చేయాలన్నా చైనానుంచి పరికరాలను సరఫరా జరగాలి. అందువల్ల ఈ రంగం కరోనా బారిన పడిందని చెప్పవచ్చు.

కెమికల్స్‌
దేశీయంగా తయారు చేసే అనేక ‘డై’ ల ముడి పదార్ధాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. చైనా నుంచి ‘డై’ల ముడిపదార్థాల షిప్‌మెంట్‌ల రవాణాకు అంతరాయం ఏర్పడడం వల్ల  ముడిపదార్థాల ధరలు పెరిగాయి. దీంతో ఒక్క గుజరాత్‌ రాష్ట్రంలో 20 శాతం ఉత్పత్తి దీని ప్రభావానికి గురైంది. టెక్స్‌టైల్స్‌ రంగంలో వినియోగించే ‘డై’లకు చైనా ప్రధాన సరఫరాదారుగా ఉంది. ముఖ్యంగా డెనిమ్‌లో వాడే ఇండిగో డై  చైనా నుంచే వస్తుంది. అయితే యూఎస్‌, ఈయూలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ‘డై’లను సరఫరా చేయగలిగితే  కొంతవరకు ఈ పరిశ్రమలు బయటపడ్డట్లే.

ఎలక్ట్రానిక్స్‌
ఎలక్ట్రానిక్స్‌ అంటే చైనా ..చైనా అంటే ఎలక్ట్రానిక్‌గా ప్రముఖంగా చెప్పుకోవాల్సిందే. ఎలక్ట్రికల్‌ విడిభాగాలేగాక ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు కూడా ఎన్నో చైనా తయారు చేసి అమ్ముతుంది. మన దేశంలో మొత్తం జనాభాలో 70 నుంచి 80 శాతం మంది చైనా ఎలక్ట్రిక్‌ వస్తువులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సరఫరా నిలిచిపోయి స్మార్ట్‌ ఫోన్ల విక్రయాలు పడిపోయిన సంగతి తెలిసింది. దీనిలో ఐఫోన్‌, షావోమీ, రియల్‌మీ వంటి అనేక ఉత్పత్తులు నిలిచిపోయాయి.

సోలార్‌పవర్‌
పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ఈ మధ్యకాలంలో సోలార్‌ పవర్‌ వినియోగం పెరిగింది. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులను ఇండియాలో అభివృద్ధి చేస్తున్నప్పటికీ వాటికి కావాల్సిన సోలార్‌ మాడ్యూల్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయంలో సోలార్‌ మాడ్యూల్స్‌ 60గా శాతం ఉంది. అయితే ఇండియా సోలార్‌ మార్కెట్లు చైనా కంపెనీలతో పోటీపడలేకపోతున్నాయి. చైనా కంపెనీలు తక్కువ ధరకు విక్రయిస్తుండడంతో 80 శాతం సోలార్‌సెల్స్‌, మాడ్యూల్స్‌ను అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. వైరస్‌ వ్యాప్తితో ఈ మాడ్యూల్స్‌ సరఫరా తగ్గడంతో భారత్‌లో డిమాండ్‌కు తగ్గ సోలార్‌ మాడ్యూల్స్‌ లేకపోవడంతో కొరత ఏర్పడింది. 

ఇన్‌ఫర్మెషన్‌ టెక్నాలజీ
చైనాలో లునార్‌ న్యూ ఇయర్‌ హాలీడేస్‌ను పొడిగించడంతో మ్యాన్‌ పవర్‌ తగ్గి ఐటీ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం పడింది. మ్యాన్‌ పవర్‌ లేకపోవడంతో  ప్రాజెక్టులన్నీ అనుకున్న సమయానికి పూర్తిగాక పోవడంతో కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి. దీంతో చైనాలో ఉన్న ఇండియన్‌ ఐటీ కంపెనీలు మలేసియా, వియత్నాం వంటి దేశాల్లో సర్వీస్‌ ప్రొవైడర్లను ఆశ్రయిస్తున్నాయి. దీంతో ఇతర దేశాల పౌరులకు ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంది.

షిప్పింగ్‌
జనవరి మూడోవారం నుంచే ఇండియా చైనాల మధ్య నౌకా రవాణా ఆగిపోవడంతో 2020 ఆర్ధిక సంత్సరం మొదటి త్రైమాసికంలో ఆదాయాలు పడిపోయాయి. నౌకా మార్గం ద్వారా రవాణా అయ్యే ఉత్పత్తులన్నీ ఆగిపోయాయి.దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఆయా వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి.

ఏవియేషన్‌ , పర్యాటకం
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి తాత్కాలికంగా కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయడంతో పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం దెబ్బతింది. వివిధ దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో రవాణారంగం, పర్యాటకం నష్టపోతున్నాయి. ఈ రెండింటి మీద ఆధారపడ్డ చిన్నచిన్న రిటైల్‌ చిరు వ్యాపారాలు కుదేలయ్యే అవకాశాలు ఉన్నాయి.

టెక్స్‌టైల్స్‌
ఫ్యాబ్రిక్‌, నూలు, ఇతర టెక్స్‌టైల్స్‌ ముడిపదార్థాలను ఇండియా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కరోనా వ్యాప్తితో అంతరాయం ఏర్పడి 50 శాతం ఎగుమతులు పడిపోయయి. టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలు, స్పింన్నింగ్‌ మిల్స్‌పై ప్రత్యక్ష ప్రభావం పడి.. ఆయా మిల్లులు వార్షిక వడ్డీల చెల్లింపుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇప్పటికే సరైన మద్దతు ధర లభించడంలేదని వాపోతున్న పత్తి రైతులుకు ఇది అంత మంచి శుభపరిమాణం కాదు. చైనాలో ఈ సంక్షోభం మరింత కాలం కొనసాగితే పత్తిడిమాండ్‌ బాగా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.You may be interested

చమురు పతనంతో మనకు భలే లబ్ది

Saturday 7th March 2020

దేశీయంగా తగ్గనున్న దిగుమతులు బిల్లు చౌక కానున్న పెట్రోల్‌, డీజీల్‌ ఉత్పత్తులు విమానయానం, నౌకాయానం, రైల్‌, రోడ్‌ రంగాలకు మేలు పెయింట్లు, టైర్లు, పాలిమర్‌ పరిశ్రమలకూ ప్లస్సే రూపాయికీ ప్రయోజనమే ఉన్నట్టుండి శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు కుప్పకూలాయి. ధరలకు దన్నుగా ఉత్పత్తిలో కోతలను పెంచేందుకు ఒపెక్‌ చేసిన ప్రతిపాదనను రష్యా తిరస్కరించడంతో చమురు ధరలు ఏకంగా 10 శాతం పతనమయ్యాయి. ఇండియన్‌ బాస్కట్‌లో భాగమైన బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ధర దాదాపు 5 డాలర్లు

10 శాతం పడిపోయిన చమురు ధరలు

Saturday 7th March 2020

ఉత్పత్తిలో కోతలకు రష్యా విముఖం నాలుగేళ్ల కనిష్టానికి  కనిష్టానికి చమురు ధరలు రోజురోజుకీ నీరసిస్తున్న చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఉత్పత్తిలో కోతలను అమలు చేసే ప్రణాళికలకు రష్యా నో చెప్పడంతో వారాంతాన ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏకంగా 10 శాతం పతనమయ్యాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 9.4 శాతం(4.72 డాలర్లు) పడిపోయి 45.27 డాలర్ల వద్ద ముగిసింది. ఇది 2017 జులై తదుపరి  కనిష్టంకాగా.. ఈ బాటలో

Most from this category