News


నిలిచిపోయిన వోల్వో కార్స్‌ ఉత్పత్తి

Saturday 21st March 2020
news_main1584766867.png-32614

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో తన ఉత్పత్తిని ఆపివేసింది. కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా యూరప్‌, అమెరికాల్లోని ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు శుక్రవారం ప్రకటించింది. బెల్జియం ప్లాంట్‌లో మంగళవారమే ఉత్పత్తిని నిలుపుచేయగా, స్వీడన్‌లోని మూడు ప్లాంట్లలోనూ.. అమెరికాలోని దక్షిణ కెరొలినలోని ప్లాంట్లలో మార్చి 26 నుంచి ఉత్పత్తి ఆపివేస్తున్నట్లు వివరించింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడి, సంస్థ కొనసాగడం కోసం తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ సీఈఓ హకన్ శామ్యూల్‌సన్‌ వ్యాఖ్యానించారు. బెల్జియం ప్లాంట్‌ ఏప్రిల్‌ 5న, ఇతర ప్రాంతాల్లో 14న తిరిగి ప్రారంభంకానున్నాయని అన్నారు. అప్పటివరకు ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంలో ఉంటారని చెప్పారు.



You may be interested

సోమవారం ఐసీఐసీఐ 10 శాతం గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌?

Saturday 21st March 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 560 పాయింట్లు డౌన్‌ శుక్రవారం అమెరికా మార్కెట్లు డీలా   సోమవారం(23న) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి నష్టాలతో ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఏకంగా 560 పాయింట్ల క్షీణతను సూచిస్తోంది. 8,178 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో మార్చి ఫ్యూచర్స్‌ 8,738 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. శుక్రవారం యూఎస్‌ మార్కెట్లలో మరోసారి అమ్మకాలదే పైచేయిగా

అందరినీ ఆర్థికంగా ఆదుకోండి

Saturday 21st March 2020

పేదోడికి రూ.5,000 సాయం చేయండి బలహీన వర్గాలకు రూ.10 వేలు ఇవ్వండి ప్రధానిని కోరిన పరిశ్రమల సమాఖ్య పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్ధీపన ప్రకటించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది. వ్యాపారాలకు భారీ అంతరాయం రానుందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అ‍న్నారు. కరోన మూలంగా రియల్టీ,

Most from this category