STOCKS

News


స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కరోనా కష్టాలు..

Wednesday 12th February 2020
news_main1581476080.png-31703

  • చైనా నుంచి పరికరాల సరఫరా సమస్యలు
  • దేశీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం
  • ఈ వారం పరిస్థితి చక్కబడొచ్చని ఆశలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ .. దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమను కూడా కలవరపెడుతోంది. పరికరాలు, సబ్-అసెంబ్లీస్ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు .. సరఫరాపరమైన సమస్యలతో క్రమంగా సెగ తగులుతోంది. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, ఈ వారంలోనైనా ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. "దేశీ పరిశ్రమపై కరోనా వైరస్ ప్రభావం ఉంది. కొన్ని ఉత్పత్తులు, మోడల్స్‌పై ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, కొన్ని ఫ్యాక్టరీలు దశలవారీగా మళ్లీ ఉత్పత్తి ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభావ తీవ్రతపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం సాధ్యపడదు" అని ఇండియా సెల్యులార్‌ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మహింద్రూ తెలిపారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు నిరాకరించిన మహింద్రూ.. దేశీ పరిశ్రమ ఈ వారమంతా వేచి, చూడాలని భావిస్తోందని పేర్కొన్నారు.     మరోవైపు, దేశీ స్మార్ట్‌ఫోన్ సంస్థలకు అవసరమైన కీలకమైన పరికరాలన్నీ చైనా నుంచే రావాల్సి ఉన్నందున.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అస్సలు బాగాలేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక డిమాండ్ లేక మార్కెట్‌లో మందగమనం పరిశ్రమను మరింత కలవరపెడుతోందని పేర్కొన్నాయి. కరోనా వైరస్‌ బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటిపోయింది. చైనా వెలుపల ఇతర దేశాల్లో 350 పైగా కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్‌, ఫిలిప్పీన్‌లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. 

మధ్యకాలికంగా సరఫరా ఇక్కట్లు: ఇండ్‌-రా
కరోనా వైరస్‌ కారణంగా మధ్యకాలికంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని రేటంగ్ ఏజెన్సీ ఇండ్‌-రా తెలిపింది. అయితే, వైరస్ ఒకవేళ హుబెయ్‌ ప్రావిన్స్‌కే పరిమితమైన పక్షంలో సమీప కాలంలో భారతీయ సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని తెలిపింది. కానీ, "కరోనా తీవ్రత మరో మూడు నాలుగు నెలల పాటు కొనసాగిందంటే మాత్రం ఫార్మా, టెక్స్‌టైల్స్‌, ఆటోమొబైల్ సంస్థలకు కీలకమైన ముడి వస్తువుల సరఫరాపరమైన సమస్యలు రావొచ్చు. ఇది 2003లో వచ్చిన సార్స్‌ ప్రభావాల కన్నా ఎక్కువగా ఉండొచ్చు" అని ఇండ్‌-రా వివరించింది. 

మొబైల్ కాంగ్రెస్‌కు దిగ్గజాలు దూరం...
కరోనా వైరస్ (ఎన్‌సీపీ) ప్రబలుతున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020కి (ఎండబ్ల్యూసీ) దూరంగా ఉండాలని భావిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా చైనాకు చెందిన హ్యాండ్‌సెట్ సంస్థ వివో, చిప్‌సెట్ సంస్థ ఇంటెల్‌తో పాటు పలు గ్లోబల్ బ్రాండ్స్‌ .. ఇందులో పాల్గొనడం లేదని ప్రకటించాయి. ‍తమ ఉద్యోగులు, ఇతరత్రా ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివో ఒక ప్రకటనలో తెలిపింది. జీఎస్‌ఎం అసోసియేషన్ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు అభినందనీయమైనప్పటికీ ఎ౾ండబ్ల్యూసీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని తాము భావిస్తున్నట్లు సాఫ్ట్‌వేర్ సేవలందించే యామ్‌డాక్స్‌ పేర్కొంది. అయితే, పరిస్థితులను బట్టి షెడ్యూల్ ప్రకారమే ఎండబ్ల్యూసీలో పాల్గొంటామని వివో అనుబంధ సంస్థ ఒపో వెల్లడించింది. ఎరిక్సన్‌, అమెజాన్‌, సోనీ వంటి దిగ్గజాలు ఇప్పటికే ఎండబ్ల్యూసీలో పాల్గొనటం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్‌...
ఫిబ్రవరి 24-27 మధ్య స్పెయిన్‌లోని బార్సెలోనాలో మొబైల్ కాంగ్రెస్‌ జరగనుంది. కరోనా వైరస్ భయాల కారణంగా చైనా నుంచి రావాల్సిన 5,000-6,000 మంది దాకా డెలిగేట్లు హాజరు కాలేకపోతున్నారని మొబైల్ కాంగ్రెస్ నిర్వహించే జీఎస్‌ఎం అసోసియేషన్ వెల్లడించింది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, షెడ్యూల్‌ ప్రకారమే ఎండబ్ల్యూసీని నిర్వహించనున్నట్లు పేర్కొంది.  You may be interested

మహీంద్రా లాభం 85 శాతం డౌన్‌

Wednesday 12th February 2020

తీవ్రంగా ప్రభావం చూపిన మందగమనం  4 శాతం తగ్గిన ఆదాయం  స్వల్పంగా పెరిగిన మార్జిన్లు ముంబై: వాహన దిగ్గజం  మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో 85 శాతం క్షీణించి రూ..200 కోట్లకు తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. డిమాండ్‌ సంక్షోభం కారణంగా వాహన అమ్మకాలు తగ్గడంతో నికర లాభం ఈ రేంజ్‌లో తగ్గిందని తెలిపింది. గత క్యూ3లో రూ.519 కోట్ల వన్‌టైమ్‌ లాభాలు రాగా,

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ కళ తప్పుతున్నాయా..?

Tuesday 11th February 2020

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లోకి పెట్టుబడులు ఎక్కువగా జనవరి-మార్చి త్రైమాసికంలో వస్తుంటాయి. కానీ, యాంఫి తాజా గణాంకాలను పరిశీలిస్తే.. జవనరి నెలలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు 10 నెలల గరిష్ట స్థాయిలో ఉంటే, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడులు తగ్గడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. 2019 జనవరిలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి రూ.1,244 కోట్ల నికర పెట్టుబడులు రాగా, అంతకుముందు

Most from this category