News


ప్రపంచమార్కెట్లలో ‘‘కరోనా’’ కలవరం..!

Monday 27th January 2020
news_main1580115970.png-31238

చైనాతో పాటు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఇప్పుడు ఆర్థిక మార్కెట్లను కలవరపెడుతోంది. చైనాలో సంభవించిన ఈ అనూహ్య సంఘటనతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై మరోసారి ఆందోళనలు రేకెత్తాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో గతవారంలో ఆసియాలో ప్రధాన మార్కెట్లైన హాంగ్‌కాంగ్‌ 2శాతం, షాంఘై 3శాతం, షాంగ్‌జెన్‌ 5శాతం నష్టాలను చవిచూశాయి. ఆర్థిక వృద్ధి మందగమన బెంగతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 3శాతానికి పైగా పడిపోయాయి. హోటల్స్‌ గ్రూప్‌, ఏయిర్‌లైన్స్‌, లగ్జరీ రీటైలర్స్‌ అమ్మకాలు భారీగా తగ్గాయి.  

కరోనా వైరస్‌ను చికాగో ఆఫ్‌ చైనాగా పిలువబడే వుహాన్‌ ప్రాంతంలో కనుక్కొన్నారు. ఈ 21వ శతాబ్దంలో మొట్టమొదటి అతిపెద్ద ప్రాణాంతక అంటువ్యాధిగా ఈ వ్యాధి గుర్తించబడింది. ఇప్పటిదాకా వైరస్​కు బలైన వారి సంఖ్య 56కు పెరిగింది. కొత్త కరోనా వైరస్​ కేసుల సంఖ్య కూడా 2500కి చేరింది. 2003లో చైనాను  దెబ్బతీసిన సార్స్‌ వ్యాధికి, కరోనా వైరస్‌కు దగ్గర పోలికలు ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిచడంతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక దేశంగా పిలువబడే  చైనా వృద్ధిని తీవ్రంగా  దెబ్బతీస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి.


వైరస్​ వేరే ప్రాంతాలకు సోకకుండా వుహాన్​, హువాంగాంగ్​సిటీలకు రాకపోకలను బంద్​ పెట్టిన చైనా, ఇప్పుడు ఆ నిబంధనలను మొత్తం 13 ప్రావిన్సులకు పెంచింది. దాని ప్రభావం 4.1 కోట్ల మంది జనంపైన పడింది. వుహాన్, హుబీ ప్రావిన్స్ ప్రాంతాలు వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం సుమారు 11 మిలియన్ల జనాభా ఉండటంతో పాటు చైనాలకు ఈ ప్రాంతం ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతోంది. చైనాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ డాంగ్ఫెంగ్ ఈ ప్రాంతం‍లోనే కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాంతం 2018 లో చైనా జీడీపీలో సుమారు 4,224 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తిని చేసింది.  ఈ మొత్తం పరిమాణం వియత్నాం, పోర్చుగల్‌ దేశాల జీడీపీకి సమానం. చైనా మొత్తం ఆర్థిక ఉత్పత్తిలో 1 శాతం కంటే ఎక్కువ. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ప్రాంతంలో ఉత్పత్తులు కుంటుపడటంతో చైనా ఆర్థిక వ్యవస్థ రోజురోజూకు క్షీణిస్తోంది. 


శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ నివారణ చర్యలో భాగంగా అక్కడి ప్రభుత్వం నగరాల మధ్య ప్రయాణాలను నిషేధించింది. ప్రతి ఏటా జనవరి 25 నుంచి వారంరోజులపాటు జరుపుకొనే నూతన లునార్‌ వేడుకల కళ తప్పంది. వేడుకల్లో భాగంగా సుమారు 40 కోట్ల మంది చైనీయులు దేశవ్యాప్తంగా పర్యటించాలని ఆశిస్తుంటారు. వేడుకల్లో భాగంగా  చైనీయులు యూరోపియన్‌ లగ్జరీ బ్రాండ్లను భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. యూరప్‌ లగ్జరీ బాండ్లకు చైనాలో 35శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఈ ఏడాది  కరోనా వైరస్‌ కారణంగా అమ్మకాలు భారీగా తగ్గాయి. ప్రయాణాలు నిషేధించడంతో అమ్మకాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనాలో లోహాలకు డిమాండ్‌ తగ్గవచ్చనే అందోళనలతో లండన్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో లిస్టైన రియో టింటో, గ్లెన్‌మార్క్‌ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి.  


అమెరికా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ జెఫారిస్ విశ్లేషకుడు మాట్లాడుతూ ‘‘ అమెరికా-చైనాల మధ్య జరిగిన వాణిజ్య యుద్ధంతో చైనా ఆర్థిక వృద్ధి 29ఏళ్ల గరిష్టస్థాయి తాకింది. అయితే ఇరుదేశాల మధ్య చర్చల ద్వారా కుదిరిన ఒప్పందంతో గతేడాది డిసెంబర్‌ నుంచి కొంత రికవరీ అవుతోంది. ఈ కీలక సమయంలో కరోనా వైరస్‌ చైనా ఆర్థిక వ్యవస్థను తిరిగి కష్టాల్లోకి నెట్టింది. వైరస్‌ మరింత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. రాబోయే కొద్ది నెలల్లో పర్యాటక, రిటైల్, ట్రావెల్‌ రంగాలు భారీగా దెబ్బతినవచ్చు. దురదృష్టవశాత్తు ఇది పూర్తిస్థాయి అంటువ్యాధిగా మారితే ప్రపంచ మార్కెట్లు మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మార్చి నాటి వ్యాధి నిర్మూలన జరగకపోతే ఈ ఏడాది(2020) చైనా తొలి త్రైమాసిక ఆర్థిక వృద్ధి 6శాతం కంటే తక్కువ నమోదు కావచ్చుని హెచ్చరించారు. You may be interested

విదేశీ ఉత్పత్తులు మరింత ప్రియం

Monday 27th January 2020

బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపు..?  ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే  వార్షిక బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇతర దేశాల నుంచిద మన దేశానికి దిగుమతి అయ్యే 50పైగా వస్తువులపై దిగుమతి సుంకం పెరగనుంది.56 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, రసాయనాలు, హస్తకళలు వంటి దిగుమతులు ఈ జాబితాలో ఉన్నాయి. మొబైల్‌ చార్జర్స్‌, ఇండస్ట్రీయల్‌ కెమికల్స్‌, ల్యాంప్స్‌, చెక్కతో తయారు చేసిన

విశాకా, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ అప్‌- జేఎస్‌డబ్ల్యూ వీక్‌

Monday 27th January 2020

ప్రపంచ ఇన్వెస్టర్లలో తలెత్తిన కరోనా వైరస్‌ భయాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 240 పాయింట్లు క్షీణించి 41,373కు చేరగా.. నిఫ్టీ 71 పాయింట్ల వెనకడుగుతో 12,172 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల కారణంగా విశాకా ఇండస్ట్రీస్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో

Most from this category