News


‍కరోనా ప్రభావంపై సెబీ కసరత్తు

Thursday 5th March 2020
news_main1583382062.png-32291

  • అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం 
  • సెబీ హోల్‌టైమ్‌ మెంబర్‌ ఎస్‌.కె. మోహంతి హామీ 

ముంబై: క్యాపిటల్‌ మార్కెట్లపై కరోనా వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయమై సెబీ అంతర్గతంగా మదింపు చేస్తోంది. కరోనా వైరస్‌ గురించి, అది మార్కెట్‌పై చూపగల ప్రభావం గురించి సెబీకి తగిన అవగాహన ఉందని సెబీ హోల్‌-టైమ్‌ మెంబర్‌ ఎస్‌.కె. మోహంతి పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని వివరించారు. ఆసోచామ్‌ ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(ఇన్విట్‌)లకు సంబంధించి డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. 



You may be interested

ఏపీలో ‘సాలోమ్‌’ ఉత్పత్తుల తయారీ

Thursday 5th March 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పవర్‌ సొల్యూషన్స్‌ రంగంలో ఉన్న తైవాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ సాలోమ్‌ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తయారు కానున్నాయి. ఈ మేరకు అమర రాజా ఎలక్ట్రానిక్స్‌తో కంపెనీ బుధవారమిక్కడ చేతులు కలిపింది. అమర రాజాకు చెందిన చిత్తూరు ప్లాంటులో ఎక్స్‌టర్నల్‌ పవర్‌ సప్లైస్‌, బ్యాటరీ చార్జర్స్‌, వాల్‌ ప్లగ్‌ ఇన్‌ పవర్‌ సప్లైస్‌, కార్‌ చార్జర్స్‌, వెహికిల్‌ పవర్‌ అడాప్టర్స్‌, పవర్‌ బ్యాంక్స్‌,

ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐ దర్యాప్తును ఆదేశించిన ఎన్‌సీఎల్‌ఏటీ

Thursday 5th March 2020

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ)ను నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సీసీఐ తన డైరెక్టర్ జనరల్ (డీజీ) చేత ఈ దర్యాప్తును జరిపించాలని బుధవారం సూచించింది. జస్టిస్ ఎస్.జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. సీసీఐ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి, తాజా దర్యాప్తునకు ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్‌

Most from this category