STOCKS

News


ఆర్థిక రంగం... అంతా నిరాశే!

Tuesday 1st October 2019
news_main1569896509.png-28637

ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్‌... ద్రవ్యలోటు... రూపాయి... విదేశీ రుణ భారం... ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి సోమవారం వెలువడిన లెక్కలన్నీ ఆర్థిక విశ్లేషకులకు నిరాశ కలిగిస్తున్నాయి. ఆయా అంశాలను పరిశీలిస్తే...

ద్రవ్యలోటు... 5 నెలల్లోనే భయాలు..!
ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు ఆగస్టు ముగిసే నాటికే 5,53,840 కోట్లకు చేరింది. 2019-2020 మొత్తంలో బడ్జెట్‌ నిర్దేశించుకున్న పరిమాణంలో ఇప్పటికే 78 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద (మార్చి వరకూ) ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లకు ‍కట్టడి చేయాలని 2019-20 బడ్జెట్‌ నిర్దేశించుకుంది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతం.  అయితే ఐదు నెలలు గడిచే సరికే ద్రవ్యలోటు 78 శాతానికి చేరడం ఆందోళనకరమైన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా కేంద్రం కార్పొరేట్‌ పన్నును కూడా భారీగా తగ్గించిన నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాలను చేరడంపై ఆందోళనలు ఉన్నాయి. అయితే ద్రవ్యలోటు లెక్కలను తరువాత చూసుకుంటామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. 

మౌలికం ‘గ్రూప్‌’ దారుణ పతనం

  • ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా క్షీణత
  • 0.5 శాతంగా నమోదు
  • మూడేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి

- ఎనిమిదింటిలో ఐదు మైనస్‌ న్యూఢిల్లీ:ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం గ్రూప్‌ ఆగస్టులో దారుణ పనితనాన్ని ప్రదర్శించింది. ఆగస్టులో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా -0.5 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలతో పోల్చి (సంబంధిత నెల్లో వృద్ధి 4.7 శాతం) ఈ గ్రూప్‌ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలోకి జారిందన్నమాట.  గడచిన మూడు సంవత్సరాల్లో (2015 నవంబర్‌లో -1.3 శాతం తరువాత) ఇలాంటి స్థితిని (క్షీణత) చూడ్డం ఇదే తొలిసారి. మొత్తం​ ఎనిమిది పరిశ్రమల్లో ఐదు క్షీణతను చూడ్డం మరో ప్రతికూలాంశం. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

క్షీణతలో...5
బొగ్గు: 2.4 శాతం (2018 ఆగస్టు) వృద్ధి తాజా సమీక్షా నెలలో (2019 ఆగస్టు) -8.6 శాతానికి క్షీణించింది. 
క్రూడ్‌ ఆయిల్‌: మరింత క్షీణతలోకి జారింది. -3.7 శాతం నుంచి -5.4 శాతానికి పడింది. 
సహజ వాయువు: 1 శాతం వృద్ధి రేటు నుంచి -3.9 శాతం క్షీణతలోకి పడిపోయింది.
సిమెంట్‌: ఈ రంగంలో ఆగస్టులో -4.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో ఈ రంగం భారీగా 14.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 
విద్యుత్‌: 7.6 శాతం వృద్ధి రేటు -2.9 శాతం క్షీణతలోకి పడిపోయింది. 

తగ్గినా వృద్ధిలోనే...1
రిఫైనరీ ప్రొడక్టులు: ఈ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలల్లో ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది.

వృద్ధిలో... 2
స్టీల్‌: ఈ రంగంలో వృద్ధిరేటు 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. 
ఎరువులు: ఈ రంగంలో క్షీణ రేటు వృద్ధిలోకి మారడం గమనార్హం. 2019 ఆగస్టులో వృద్ధి రేటు 2.9 శాతం నమోదయ్యింది. అయితే 2018 ఇదే నెల్లో వృద్ధిలేకపోగా -5.3 శాతం క్షీణత నమోదయ్యింది. 

ఐదు నెలల్లోనూ పేలవమే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు 2.4 శాతంగా ఉంది. అయితే 2018 ఇదే నెలలో ఈ వృద్ధిరేటు 5.7 శాతం. 

ఐఐపీపై ప్రభావం...
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా దాదాపు 38 శాతం. ఆగస్టులో ఐఐపీ గ్రూప్‌ పనితీరుపై తాజా ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌ ఫలితాల ప్రతికూల ప్రభావం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. అక్టోబర్‌ 2వ వారంలో ఐఐపీ ఆగస్టు ఫలితాలు వెల్లడికానున్నాయి. జూలైలో ఐఐపీ (4.3 శాతం) కొంత మెరుగైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, ఇది రికవరీకి సంకేతం కాదని తాజా (ఆగస్టు మౌలిక రంగం గ్రూప్‌) గణాంకాలు సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

రుణ భారం... పెరిగింది...
భారత విదేశీ రుణ భారం 2019 జూన్‌తో ముగిసిన నెలకు 557.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మార్చి 2019తో ముగిసిన త్రైమాసికం నుంచీ చూస్తే, ఈ పెరుగుదల 14.1 బిలియన్‌ డాలర్లు. విదేశీ రుణ భారంలో ప్రధాన భాగంగా ఉన్న వాణిజ్య రుణాలు 38.4 శాతం పెరిగాయి. తరువాతి స్థానంలో ప్రవాస భారతీయుల డిపాజిట్లు (24 శాతం), స్వల్పకాలిక వాణిజ్య రుణం (18.7 శాతం) ఉన్నట్లు ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటన ఒకటి తెలిపింది. You may be interested

రుణ భారం తగ్గించుకుంటాం !

Tuesday 1st October 2019

గ్రూప్‌ కంపెనీల ఏజీఎమ్‌ల్లో అనిల్‌ అంబానీ  ముంబై: దేశంలో అగ్రశ్రేణి ఐదు రక్షణ కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ను నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అనిల్‌ ధీరుబాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం రిలయన్స్‌ ఇన్‌ఫ్రా రుణభారం రూ.6,000 కోట్లుగా ఉందని, దీనిని తగ్గించుకోనున్నామని సోమవారం ఇక్కడ జరిగిన కంపెనీ ఏజీఎమ్‌లో ఆయన పేర్కొన్నారు. ఇతర గ్రూప్‌ కంపెనీలు-రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌,

ఇప్పుడు బంధన్‌ బ్యాంకే నయం: బందోపాధ్యాయ

Tuesday 1st October 2019

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా బ్యాంకింగ్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అందుకు సూక్ష్మ రుణ సంస్థలనే సిఫారసు చేస్తానని చెప్పారు ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ గ్రూపు చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ. దురదృష్టవశాత్తూ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సేవల రంగం నుంచి దుర్వార్తలను వినాల్సి వస్తోందన్నారు. పీఎంసీ బ్యాంకు ఉదంతాన్ని ప్రస్తావించారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకును దిద్దుబాటు కార్యాచరణ పరిధిలోకి ఆర్‌బీఐ తీసుకురావడం కూడా దురదృష్టకరంగా అభివర్ణించారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకుతో విలీనం కోసం ప్రయత్నం

Most from this category