News


నెమ్మదించిన కీలక ఎనిమిది రంగాలు

Thursday 1st August 2019
news_main1564640287.png-27471

  • జూన్‌ మౌలిక రంగం వృద్ధి
  • కేవలం 0.2 శాతం
  • ఆయిల్‌, సిమెంట్‌ ఉత్పత్తి పేలవ పనితీరు

న్యూఢిల్లీ: మౌలిక విభాగంగా పేర్కొనే ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్‌ పనితీరు జూన్‌లో పేలవంగా ఉంది. వృద్ధి రేటు (2018 జూన్‌ ఉత్పత్తితో పోల్చి) కేవలం 0.2 శాతంగా నమోదయ్యింది. చమురు, సిమెంట్‌ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారడం దీనికి ప్రధాన కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్‌ 40.27 శాతం.  మే గణాంకాలను సైతం కేంద్రం దిగువముఖంగా సవరించడం గమనార్హం. మే నెల వృద్ధి శాతాన్ని 5.1 శాతం నుంచి 4.3 శాతానికి కుదించడం జరిగింది. బుధవారం వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం జూన్‌లో ఎనిమిది రంగాల పనితీరునూ చూస్తే...

క్షీణతలో 4...
- క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా 6.8 శాతం క్షీణత (మైనస్‌) నమోదయ్యింది. 
- రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి రేటు -9.3 శాతం క్షీణించింది. 
- సిమెంట్‌ రంగం కూడా 1.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 
- సహజ వాయువుల విభాగంలో కూడా -2.1 శాతం క్షీణత నమోదయ్యింది. 

వృద్ధిలో 4...
- స్టీల్‌ పరిశ్రమ 6.9 శాతం వృద్ధిని సాధించింది.
- విద్యుత్‌ ఉత్పత్తిలో వృద్ధి రేటు 7.3 శాతం. 
- ఎరువుల రంగంలో కేవలం 1.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. 
- బొగ్గు ఉత్పత్తిలో 3.2 శాతం వృద్ధి నమోదయ్యింది. 

ఏప్రిల్‌-జూన్‌ మధ్య...
కాగా 2019-20 మొదటి త్రైమాసికంలో ఈ గ్రూప్‌ వృద్ధి రేటు 3.5 శాతంగా నమోదయ్యింది. కాగా ఆగస్టు రెండవ వారంలో విడుదలయ్యే జూన్‌ ఐఐపీ గణాంకాల్లో మౌలిక రంగం ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఆర్‌బీఐ పాలసీ నేపథ్యం...
ఆగస్టు 7వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక రంగం నెమ్మదించడం, మొత్తం ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణరేటు- రెపోను (ప్రస్తుతం 5.75 శాతం) ఆర్‌బీఐ మరో పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గడచిన మూడు ద్వైమాసిక సమీక్షల్లో ఆర్‌బీఐ పాలసీ రేటును ముప్పావుశాతం తగ్గించిన సంగతి తెలిసిందే.



You may be interested

నష్టాల్లో ప్రభుత్వ బ్యాంకింగ్‌ షేర్లు

Thursday 1st August 2019

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.42 సమయానికి 1.37 శాతం నష్టపోయి 2,718.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఇండియా 2.56  శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 2.14  శాతం, పీఎన్‌బీ 1.95 శాతం, ఎస్‌బీఐ 1.87 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 1.56 శాతం, కెనరా బ్యాంక్‌ 1.35 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 1.24 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 0.95 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌

ఫార్మా డౌన్‌

Thursday 1st August 2019

 నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఉదయం 11.29 సమయానికి 1.66 శాతం నష్టపోయి 7,855.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో అరబిందో ఫార్మా 2.76 శాతం, డా. రెడ్డీస్‌ 2.06 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 1.95 శాతం, సిప్లా 1.62 శాతం కాడియల్‌ హెల్త్‌ కేర్‌ 1.60 శాతం, లుపిన్‌ 1.50 శాతం, బయోకాన్‌ లి. 1.48 శాతం, దివిస్‌ ల్యాబ్‌ 1.33 శాతం, సన్‌ ఫార్మా 1.18

Most from this category