News


మందగమన తీవ్రతకు ‘మౌలికం’ అద్దం

Friday 1st November 2019
news_main1572581072.png-29278

  • 8 పారిశ్రామిక రంగాల గ్రూప్‌ 
  • సెప్టెంబర్‌లో పేలవ పనితీరు
  • వృద్ధిలేకపోగా 5.2 శాతం క్షీణత

న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌ సెప్టెంబర్‌ ఫలితాలు ప్రతిబింబించాయి. సమీక్షా నెల్లో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా - 5.2 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 సెప్టెంబర్‌ ఉత్పత్తితో పోల్చితే 2019 సెప్టెంబర్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యిందన్నమాట. గురువారం విడుదలైన అధికారిక  గణాంకాల ప్రకారం...

ఎరువుల ఉత్పత్తి తప్ప అన్నీ మైనస్‌లోనే...
- బొగ్గు (-20.5 శాతం), క్రూడ్‌ ఆయిల్‌ (-5.4 శాతం), సహజ వాయువు (-4.9 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (-6.7 శాతం), సిమెంట్‌ (-2.1 శాతం), స్టీల్‌ (-0.3 శాతం) విద్యుత్ (-3.7 శాతం) క్షీణతను నమోదుచేసుకున్నాయి. అయితే ఒక్క ఎరువుల రంగం మాత్రం 5.4 శాతం ఉత్పత్తి వృద్ధిని నమోదుచేసుకుంది. 
- 2018 సెప్టెంబర్‌లో ఈ ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌ వృద్ధిరేటు 4.3 శాతం
- కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ చూస్తే- ఈ కాలంలో వృద్ధి కూడా కేవలం 1.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.5 శాతంగా ఉంది. 
-  పారిశ్రామిక రంగంలో తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ పేర్కొంది. 
- మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వాటా దాదాపు 40 శాతం. ప్రతినెలా రెండవ వారంలో ఐఐపీ గణాంకాలు వెలువడతాయి. తాజా గణాంకాలు దారుణంగా ఉన్న నేపథ్యంలో ఇదే ఫలితాలు సెప్టెంబర్‌ ఐఐపీ గణాంకాలపైనా ప్రతిబింబించే అవకాశం ‍ఉందన్నది ఆర్థిక వేత్తల విశ్లేషణ. సెప్టెంబర్‌లో ఐఐపీ ఫలితాలు కూడా క్షీణతలోనే -2.5 శాతం నుంచి -3.5 శాతం శ్రేణిలో ఉంటాయని భావిస్తున్నట్లు ఐసీఆర్‌ఏ అంచనావేసింది. 
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతం దాటకపోవచ్చని ఇప్పటికే పలు అంచనాలు వెలువడుతున్నాయి. 



You may be interested

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Friday 1st November 2019

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో స్వల్పంగా నష్టపోయి 70.98 వద్ద ప్రారంభమైంది. కాగా నెల చివరిలో డాలర్‌ డిమాండ్‌ బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 70.92 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో పాటు డాలర్‌ డిమాండ్‌ బలపడడంతో రూపీ సెంటిమెంట్‌ బలహీనపడిందని విశ్లేషకులు తెలిపారు. యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలుండడంతోపాటు, ఫెడ్‌ వడ్డీ రేట్లను

కాగ్నిజెంట్‌ లాభం 49.7 కోట్ల డాలర్లు

Friday 1st November 2019

4 శాతం వృద్ధి  4 శాతం వృద్దితో 425 కోట్ల డాలర్లకు ఆదాయం  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 4 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 47.4 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ సెప్టెంబర్‌ క్వార్టర్లో 49.7 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజెంట్‌ పేర్కొంది. మొత్తం ఆదాయం 407 కోట్ల డాలర్ల నుంచి 4 శాతం వృద్ధితో 425

Most from this category