News


మౌలిక రంగం డౌన్‌

Wednesday 1st January 2020
news_main1577849929.png-30576

  • నవంబర్‌లో 1.5 శాతం క్షీణత

న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా నాలుగో నెలా క్షీణించింది. 2019 నవంబర్‌లో వృద్ధి 1.5 శాతం తగ్గింది. 2018 నవంబర్‌లో ఈ ఎనిమిది పరిశ్రమలు 3.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. తాజాగా ఎనిమిదింట అయిదు పరిశ్రమలు ప్రతికూల వృద్ధి నమోదు చేయడంతో మొత్తం గ్రూప్ వృద్ధి మందగించింది. నవంబర్‌లో బొగ్గు, క్రూడాయిల్‌, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్‌ ఉత్పత్తి క్షీణించింది. 2018 నవంబర్‌లో సిమెంటు ఉత్పత్తి వృద్ధి 8.8 శాతంగా ఉండగా.. 2019 నవంబర్‌లో 4.1 శాతానికి పరిమితమైంది. రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి 3.1 శాతం, ఎరువుల ఉత్పత్తి 13.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య కాలంలో మౌలిక పరిశ్రమలు అంతక్రితం ఏడాది ఇదే వ్యవధి స్థాయిలోనే 5.1 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇన్‌ఫ్రా గ్రూప్ వృద్ధి ఆగస్టు నుంచి మందగిస్తూనే ఉంది. 



You may be interested

0.9 శాతానికి తగ్గిన కరెంటు ఖాతా లోటు

Wednesday 1st January 2020

ముంబై: జీడీపీలో కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) సెప్టెంబర్‌ త్రైమాసికంలో 0.9 శాతానికి (6.3 బిలియన్‌ డాలర్లు) తగ్గినట్టు ఆర్‌బీఐ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి క్యాడ్‌ 2.9 శాతంగా ఉండడం గమనార్హం. విదేశీ మారకం రూపంలో నిధుల రాక, పోకల మధ్య అంతరాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. వాణిజ్య లోటు తక్కువగా 38.1 బిలియన్‌ డాలర్లుగా ఉండడమే క్యాడ్‌ తగ్గేందుకు తోడ్పడినట్టు ఆర్‌బీఐ తెలిపింది. మరి క్రితం

చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీ రేట్లు యథాతథం

Wednesday 1st January 2020

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలైన ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌ వంటి వాటిపై ప్రస్తుతమున్న రేట్లనే జనవరి-మార్చి త్రైమాసికానికి కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో నిర్ణయించిన రేట్లే తదుపరి మూడు నెలల కాలానికి కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీపై వడ్డీ రేటు 7.9 శాతంగా, కిసాన్‌ వికాస్‌ పత్రపై 7.6 శాతంగా, ఐదేళ్ల సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.6 శాతంగా, సుకన్య

Most from this category