STOCKS

News


సహకార బ్యాంకులు మరింత బలోపేతం

Thursday 6th February 2020
news_main1580961190.png-31542

  • బ్యాంకింగ్‌ చట్టాల సవరణకు క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: పీఎంసీ బ్యాంక్ తరహా సంక్షోభం మరోసారి తలెత్తకుండా డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ, సహకార బ్యాంకులను మరింత పటిష్టం చేసే దిశగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. దీని ప్రకారం సీఈవోల నియామకం వంటి పలు కీలక అంశాల్లో కమర్షియల్ బ్యాంకుల తరహాలోనే సహకార బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సీఈవో అభ్యర్థుల అర్హత వంటివి ఆర్‌బీఐ నిర్దేశిస్తుంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారమే ఆడిటింగ్ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్ సంక్షోభంలో ఉంటే.. దాని బోర్డును రద్దు చేసి, ఆర్‌బీఐ తన ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆర్‌బీఐ మార్గదర్శకాలను దశలవారీగా పాటించేందుకు సహకార బ్యాంకులకు తగినంత సమయం ఇస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)లో స్కామ్ కారణంగా ఆర్‌బీఐ ఆంక్షలు విధించడం, లక్షల మంది ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి రావడం వంటి అంశాల నేపథ్యంలో సహకార బ్యాంకులకు సంబంధించిన తాజా చట్ట సవరణ ప్రాధాన్యం సంతరించుకుంది.  



You may be interested

బీపీసీఎల్‌పై రష్యా రాస్‌నెఫ్ట్ ఆసక్తి

Thursday 6th February 2020

కేంద్ర చమురు శాఖ మంత్రితో కంపెనీ సీఈవో భేటీ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్‌) కొనుగోలుపై రష్యాకు చెందిన చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్ కూడా ఆసక్తిగా ఉంది. బుధవారం కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేం‍ద్ర ప్రధాన్‌తో సమావేశంలోనూ, ఆ తర్వాత ఇతర ఉన్నతాధికారులతో భేటీలోను రాస్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్‌ సెషిన్‌ ఈ డీల్‌పై ఆసక్తి వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన ముడిచమురు

ధూమ్‌ షో 2020

Thursday 6th February 2020

హంగామా షురూ.. లాంఛనంగా ఆటో ఎక్స్‌పో 2020 ప్రారంభం 7–12 దాకా సందర్శకులకు ఎంట్రీ పాల్గొంటున్న దేశ, విదేశీ వాహన దిగ్గజాలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటో ఎక్స్‌పో 2020 మోటార్‌ షో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి రెండు రోజుల్లో వ్యాపార వర్గాలను  అనుమతించనుండగా.. 7 నుంచి 12 దాకా సామాన్య ప్రజలు కూడా సందర్శించవచ్చు. దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థలు ఇందులో తమ

Most from this category