News


వంటనూనెలు 10 శాతం చౌక!

Tuesday 3rd March 2020
news_main1583216203.png-32242

కరోనా ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లతోపాటు వంట నూనె ధరలు పడిపోతున్నాయి. కరోనా వ్యాప్తితో అంతర్జాతీయ మార్కెట్లో మరో వారం రోజుల్లో వంటనూనెధరలు 10 శాతం తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గితే దేశీయంగా వంటనూనె ధరలు భారీ తగ్గే అవకాశం ఉంది. మన దేశంలో వార్షిక ప్రాతిపదికన 2.35 కోట్ల టన్నుల వంటనూనెలు అవసరమవుతాయి. దీనిలో దాదాపు 70 శాతం వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. అందువల్ల అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గితే మన దేశంలో వంటనూనె ధర తగ్గుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉంది. అయితే తాజా వైరస్‌ ప్రభావంతో అక్కడ డిమాండ్‌ తగ్గడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో  రేట్లు తగ్గాయని ఆదానీ విల్మర్‌ డిప్యూటీ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ ఆఫీసర్‌ అంగ్‌షూ మాలిక్‌ అన్నారు. వచ్చే వారంలో తగ్గిన ధరలు ఆయా బ్రాండ్ల ప్యాకెట్ల మీద ఉంటాయని, వినియోగదారులు పామ్‌ ఆయిల్‌, సోయాబిన్‌ ఆయల్‌ల మీద రూ.8 తగ్గింపు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ మీద రూ.5 తగ్గింపును పొందుతారని ఆయన వివరించారు. కాగా ఇండియన్‌ ఆయిల్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ దేశాయ్‌ మాట్లాడుతూ..కరోనా ప్రభావంతో గత 50 రోజులుగా డిమాండ్‌ తక్కువగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనె ధరలు 15-22 శాతం తగ్గాయన్నారు. పామ్‌ ఆయిల్‌ 20 శాతం, సోయా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లు 15శాతం తగ్గాయని తెలిపారు. గత రెండు నెలలుగా ఆవ నూనె 13 శాతం తగ్గితే, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ 20 శాతం తగ్గిందని దేశాయ్‌ పేర్కొన్నారు. 



You may be interested

52 వారాల కనిష్టానికి 241 షేర్లు

Tuesday 3rd March 2020

మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 241 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఏబీబీ ఇండియా, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అగ్రీటెక్‌ ఇండియా, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆంధ్రా సుగర్స్‌, ఆంధ్రా పేపర్‌, ఆర్కోటెక్‌, అట్లాంటా, ఆటోమోటివ్‌ యాక్సెల్స్‌, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ హిందుస్తాన్‌ సుగర్‌, బాల్మర్‌ లారీ అండ్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బాట్రానిక్స్‌ ఇండియా, బియర్డ్‌ సెల్‌, భండారీ

కరోనాకు ఫైజర్‌ నుంచి ఔషధం!

Tuesday 3rd March 2020

16 శాతం దూసుకెళ్లిన షేరు  ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు వీలుగా అమెరికన్‌ మాతృ సంస్థ కెమికల్‌ కాంపౌండ్‌ను అభివృద్ధి చేసిన వార్తలతో ఫార్మా రంగ దిగ్గజం ఫైజర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు ఉన్నట్లుండి డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఫైజర్‌ లిమిటెడ్‌ షేరు 16 శాతం దూసుకెళ్లింది. రూ. 4,925ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.6 శాతం జంప్‌చేసి రూ. 4,483

Most from this category