News


కాంటినెంటల్‌ కాఫీ కొత్త రుచులు

Wednesday 20th November 2019
news_main1574221553.png-29721

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఇన్‌స్టంట్‌ కాఫీ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్ దిస్‌ పేరుతో నాలుగు రకాల త్రీ ఇన్‌ వన్‌ ప్రీమిక్స్‌ కాఫీ రుచులను ప్రవేశపెట్టింది. 22 గ్రాముల ప్యాక్‌ ధర రూ.20గా కంపెనీ నిర్ణయించింది. అయిదు ప్యాక్‌లు కొంటే ఒకటి ఉచితం. త్వరగా కాఫీ తయారు చేసుకునేలా ప్రీమిక్స్‌ రకాలకు రూపకల్పన చేశామని కంపెనీ కంజ్యూమర్‌ మార్కెటింగ్‌ హెడ్‌ ప్రీతమ్‌ పట్నాయక్‌ తెలిపారు. సీసీఎల్‌ ప్రొడక్ట్స్ కాంటినెంటల్‌ బ్రాండ్‌లో భారత్‌తోపాటు 90కిపైగా దేశాలకు కాఫీని సరఫరా చేస్తోంది. 



You may be interested

రెండోరోజూ రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ షేర్ల ర్యాలీ

Wednesday 20th November 2019

క్రితం సెషన్‌లో సూచీలకు లాభాల ముగింపునకు కారణమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లోనూ శుభారంభం చేశాయి. రిలయన్స్‌ నిన్నటి ముగింపు(రూ.1510)తో పోలిస్తే 3శాతం లాభంతో 1555.05 వద్ద, ఎయిర్‌టెల్‌ 4.50శాతం పెరిగి రూ.426.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వచ్చే నెల నుంచి డేటా, టారీఫ్‌లను పెంచనున్నామని ప్రకటనతో టెలికాం షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేర్లు లాభాల

భారీ గ్యాప్‌అప్‌...12,000పైన నిఫ్టీ

Wednesday 20th November 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతి ఎయిర్‌టెల్‌లతో పాటు బ్యాంకింగ్‌ షేర్లు లాభాలతో ప్రారంభంకావడంతో భారత్‌ స్టాక్‌ సూచీలు భారీగ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంతో 40,720 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 12,005 పాయింట్ల గ్యాప్‌అప్‌తోనూ ఆరంభమయ్యాయి. 

Most from this category