News


లక్ష్మీ విలాస్‌ బ్యాంకుకు కమిషన్‌ మొట్టికాయ

Saturday 16th November 2019
news_main1573877112.png-29636

  • సేవా లోపానికి పరిహారం చెల్లించాలని ఆదేశాలు

న్యూఢిల్లీ: అకారణంగా ఓ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్‌ బ్యాంకు నగదును డెబిట్‌ చేసినందుకు.. ఆ మొత్తంతో పాటు పరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల వివాదాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశించింది. తమ సేవా లోపం లేదన్న బ్యాంకు వాదనను తిరస్కరించింది. పరిహారం కింద రూ.25,000తోపాటు, నగదును డెబిట్‌ చేసి నాటి నుంచి ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యాపారి గోపాల్‌ ఖాతా నుంచి లక్ష్మీ విలాస్‌ బ్యాంకు రూ.40,85,254ను 2015 ఏప్రిల్‌ 11న డెబిట్‌ చేసింది. అయితే, ఇందుకు తగిన కారణాన్ని చూపలేకపోయింది. దీంతో సేవా లోపంగా కమిషన్‌ పరిగణించింది. దీనివల్ల గోపాల్‌కు నష్టం జరిగినట్టు గుర్తించి ఈ ఆదేశాలు ఇచ్చింది. 



You may be interested

రెండవరోజూ రూపాయికి లాభాలు

Saturday 16th November 2019

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో శుక్రవారం వరుసగా రెండవరోజూ రూపాయి లాభాలను చూసింది. డాలర్‌ మారకంలో 18పైసలు లాభపడి 71.78 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల సానుకూల వైఖరి,  క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత తగ్గుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే వారం మొత్తంగా చూస్తే, రూపాయి 50 పైసలు నష్టపోయింది. 

ఐయూసీపై జాప్యం .. టెలికం సేవలకు ప్రతికూలం

Saturday 16th November 2019

రిలయన్స్ జియో వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2020 జనవరిలోగా ఎత్తివేయకుండా కొనసాగించిన పక్షంలో అందుబాటు రేట్లలో టెలికం సేవలను అందించడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిలయన్స్ జియో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్ కాల్స్ నిష్పత్తి దాదాపు సరిసమాన స్థాయిలో ఉందని, ఈ రెండింటి మధ్య భారీ అసమతౌల్యం ఉందన్న కారణంతో ఐయూసీ ఎత్తివేతను వాయిదా వేయడం సరికాదని  జియో డైరెక్టర్ మహేంద్ర నహతా పేర్కొన్నారు.

Most from this category