News


కార్పొరేట్‌ మోసాలతో సవాళ్లు

Saturday 7th September 2019
news_main1567832151.png-28253

  • కేంద్ర మంత్రి ఠాకూర్‌

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న కార్పొరేట్‌ మోసాలు కార్పొరేట్‌ పరిపాలనా చట్టాలకు సవాళ్లను విసురుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌ అకాడమీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతున్న కార్పొరేట్‌ మోసాలు, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను ఎదుర్కొంటోంది. ఇవి మూలధన ఏర్పాట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దాంతో నిధులు అడుగంటిపోతున్నాయి. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ చట్టాలకు ఇది పెద్ద సవాళ్లనే విసురుతోంది’’ అని మంత్రి అన్నారు. పౌరులకు, పెట్టుబడిదారులకు అత్యుత్తమ సేవలను అందించడంతోపాటు వ్యాపార సులభతర దేశాల్లో ప్రపంచంలోనే టాప్‌-20లోకి భారత్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. నియంత్రణపరమైన అవసరాలను చేరుకునే విషయంలో దేశీయంగా వ్యాపారస్థులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. ఈ దిశగా చాలా చేయాల్సి ఉందనని, సంపద సృష్టి కర్తలను గౌరవించాల్సి ఉందన్నారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీసుకెళ్లేందుకు ప్రభుత్వ పాలసీలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు కృష్టి చేయాలన్నారు. ‘‘2014లో మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.8 లక్షల కోట్ల డాలర్లు. ఐదున్నరేళ్లలోనే 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరిగింది. ఇదే విధంగా పనిచేస్తే 5 లక్షల కోట్ల డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటాం. కావాల్సింది సానుకూల అనుసరణే’’ అని మంత్రి ఠాకూర్‌ అన్నారు. 



You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 7th September 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ ముగిసే సరికి 10,964.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10973.65పాయింట్లతో పోలిస్తే 9 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాహనరంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్చలు తీసుకోవచ్చనే అంచనాలు, అమెరికా-చైనాల మధ్య

బీఎస్‌-6కు మారడం సవాలే

Saturday 7th September 2019

బీఎస్‌-సిక్స్‌కు మారడం సవాళ్లతో కూడుకున్నదే  జీఎస్‌టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి  సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వాధేరా  న్యూఢిల్లీ: భారత్‌ స్టేజ్‌-సిక్స్‌ (బీఎస్‌-6) నిబంధనలకు వాహన రంగం సజావుగా మారడానికి ప్రభుత్వం తగిన విధంగా తోడ్పాటునందించాలని సియామ్‌ కోరింది. బీఎస్‌-సిక్స్‌  నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తున్నా,  బీఎస్‌-సిక్స్‌ ఇంధనాల లభ్యత విషయమై  ఆందోళన ఉందని సియామ్‌(సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటో మాన్యుఫాక్చరర్స్‌) ప్రెసిడెంట్‌ రాజన్‌ వాధేరా చెప్పారు. ఇక్కడ జరిగిన ఏసీఎమ్‌ఏ(ఆటోమోటివ్‌

Most from this category