టెల్కోల ఆశలపై నీళ్లు!
By D Sayee Pramodh

కార్యదర్శుల కమిటీ రద్దు
ఇంకా ఛాన్సులున్నాయంటున్న సీఓఏఐ
టెలికం రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ కధ ముగిసిందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. దీంతో స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల మారిటోరియం విధింపు అనే ఊరటతో టెలికంలు సరిపెట్టుకోవాల్సివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల మారిటోరియంతో కంపెనీలకు రూ. 42వేల కోట్ల లబ్ది చేకూరుతుందని సదరు అధికారి గుర్తుచేశారు. అందువల్ల ఇకపై ప్రభుత్వం నుంచి ఆశించడానికేమీ లేదన్న సంకేతాలిచ్చారు. అందుకే కార్యదర్శుల కమిటీని రద్దుచేశారన్నారు. ఏజీఆర్‌పై చర్చించి రిలీఫ్ అందించేందుకు మంత్రులతో కూడిన బృందం ఏర్పాటుచేసే యోచనేమీ లేదని, అది సుప్రీంకోర్టు నిర్ణయించాల్సిన విషయమని ఆయన చెప్పారు. టెలికమేతర కంపెనీలైన పవర్గ్రిడ్లాంటి వాటిపై ఏజీఆర్ ఆర్డరు కారణంగాపడే భారం నుంచి ఎలాంటి రిలీఫ్ అందించే ఆలోచన లేదన్నారు. కావాలంటే ఆ కంపెనీలు కూడా కోర్టునాశ్రయించవచ్చన్నారు. అదివారికి రాజ్యాంగం ఇచ్చేహక్కని గుర్తుచేశారు.
చివరి ఆశలు..
మరోపక్క సీఓఏఐ(సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) మాత్రం టెలికం రంగానికి మరింత ఊరట వస్తుందన్న నమ్మకంతో ఉంది. కమిటీరద్దు చేశారంటే ప్రభుత్వం టెల్కోలకు దీర్ఘకాలిక ఉపశమనం కలిగించడంపై ఆలోచన మానుకున్నట్లు కాదని సీఓఏఐ డీజీ రాజన్ మాథ్యూస్ ఆశాభావం వ్యక్తం చేశారు. టెల్కోల సమస్యలను ప్రభుత్వం గుర్తించి సరైన సమయంలో సరైన మార్గంలో సాయం అందిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. టెలికం రంగాన్ని ఆదుకోవడానికి స్పెక్ట్రం చెల్లింపులను వాయిదా వేసిన ప్రభుత్వం 8 శాతం ఏజీఆర్‌పై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కంపెనీలు త్వరలో ఈ మొత్తాలను చెల్లించాల్సిఉంది. ఇప్పటికే ఈ విషయంలో స్పష్టత కోరుతూ వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాయి. మరోవైపు తమకు రావాల్సిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్స్‌ను చెల్లించాలని టెల్కోలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌కు డీఓటి రిఫర్ చేసినట్లు తెలిసింది.
You may be interested
2వారాల కనిష్టానికి పసిడి
Tuesday 26th November 2019ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 2వారాల కనిష్టానికి దిగివచ్చింది. అమెరికా చైనాల మధ్య మధ్యంతర వాణిజ్య చర్చలు త్వరలోనే సఫలం కాగలనే అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. ఆసియాలో ఉదయం సెషన్లో ఔన్స్ పసిడి ధర 3డాలర్ల నష్టంతో 1,453.80డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వాణిజ్య చర్చలు ఇప్పటికి సాజావుగా జరుగుతున్నాయి. అలాగే ఈ వారంలో మెరుగైన ఆర్థిక గణాంకాలు వెలువడే అవకాశం ఉంది. ఇవన్ని ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు పురిగొల్పుతున్నాయి.
పాజిటివ్‌గా పీఎస్‌యూ బ్యాంకులు..బ్యాంక్ ఆఫ్ ఇండియా 4% అప్
Tuesday 26th November 2019ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు మంగళవారం సెషన్లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 10.03 సమయానికి నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.29 శాతం లాభపడి 2,634.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బ్యాంక్ ఇండియా 4.02 శాతం, ఓరియంటల్ బ్యాంక్ 2.19 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.99 శాతం, అలహాబాద్ బ్యాంక్ 1.89 శాతం, యూనియన్ బ్యాంక్ 1.55 శాతం, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 1.52