News


జీఎస్‌టీ ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీలు

Thursday 26th December 2019
news_main1577329785.png-30441

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపుదారులకు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 18న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ 38వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్‌టీకి సంబంధించి, అలాగే, పన్ను చెల్లింపుదారుల సాధారణ ఫిర్యాదుల పరిష్కారం కోసం నిర్మాణాత్మక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కౌన్సిల్‌ భావించినట్టు బుధవారం విడుదలైన ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలియజేసింది. రాష్ట్రాల స్థాయిలో, జోనల్‌ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్‌టీ ఇతర భాగస్వాములకు కమిటీలో చోటు కల్పిస్తారు. రెండేళ్ల కాలానికి కమిటీలను ఏర్పాటు చేస్తామని, సభ్యుల పదవీ కాలం కూడా అదే విధంగా ఉంటుందని ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అన్ని రకాల అంశాలకు పరిష్కారం చూపించడం ఈ కమిటీ విధుల్లో భాగం. ప్రతీ త్రైమాసికానికి ఒక సారి, అవసరానికి అనుగుణంగాను కమిటీ సమావేశం అవుతుంది. ఫిర్యాదుల నమోదు, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరించే విధంగా జీఎస్‌టీఎన్‌ ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. 



You may be interested

సింగపూర్‌ను దాటేసిన హైదరాబాద్‌

Thursday 26th December 2019

క్యూ3లో ఆఫీసు అద్దెల్లో 23 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు సింగపూర్, హాంగ్‌కాంగ్‌లను దాటేశాయి. జులై – సెప్టెంబర్‌ (క్యూ3) మధ్య కాలంలో ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో ఈ మూడు నగరాల్లో 23 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఆసియా పసిఫిక్‌ క్యూ3–2019 ఆఫీస్‌ రెంటల్‌ ఇండెక్స్‌ నివేదిక తెలిపింది. బెంగళూరు తర్వాతే మెల్‌బోర్న్, బ్యాంకాక్‌.. 2019 క్యూ3లో ఆఫీస్‌ రెంట్స్‌ వృద్ధిలో

మార్చి వరకు అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై: ప్రసాద్‌

Thursday 26th December 2019

రేవారి (హర్యానా): భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం హర్యానాలోని రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది లక్ష్యం. భారత్‌నెట్‌ సేవలను ప్రోత్సహించేందుకు గాను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ 2020 మార్చి వరకు

Most from this category