News


కాగ్నిజెంట్‌ లాభం 49.7 కోట్ల డాలర్లు

Friday 1st November 2019
news_main1572580813.png-29277

  • 4 శాతం వృద్ధి 
  • 4 శాతం వృద్దితో 425 కోట్ల డాలర్లకు ఆదాయం 

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 4 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 47.4 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ సెప్టెంబర్‌ క్వార్టర్లో 49.7 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజెంట్‌ పేర్కొంది. మొత్తం ఆదాయం 407 కోట్ల డాలర్ల నుంచి 4 శాతం వృద్ధితో 425 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్వార్టర్లో ఆదాయ అంచనాలను ఈ కంపెనీ అందుకోగలిగింది. ఈ క్వా‍ర్టర్లో ఆదాయం 3.8-4.8 శాతం రేంజ్‌లో పెరగగలదని కంపెనీ అంచనా వేసింది. నిలకడ కరెన్సీ పరంగా చేస్తే, ఆదాయం 5.1 శాతం వృద్ధిని సాధించిందని కంపెనీ వివరించింది.  డిసెంబర్‌ క్వార్టర్లో ఆదాయం 2.1-3.1 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలదని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయం 3.9-4.9 శాతం రేంజ్‌లో పెరగగలదన్న అంచనాలను వెల్లడించింది. ఇక వివిధ వ్యయ నియంత్రణ పద్దతుల కారణంగా 15-20 కోట్ల డాలర్లు ఆదా అవ్వగలదన్న అంచనాలున్నాయని చెప్పారు. ఇక 2021లో మొత్తం 50-55 కోట్ల డాలర్లు ఆదా అవుతాయని కాగ్నిజెంట్‌ పేర్కొంది.  


 ఉద్యోగాల కోత...
 వ్యయ నియంత్రణ పద్థతుల్లో భాగంగా రానున్న కొన్ని నెలల్లో 7,000 వరకూ ఉద్యోగాలను తొలగించనున్నట్లు కాగ్నిజెంట్‌ తెలిపింది.      మధ్య స్థాయి నుంచి సీనియర్‌ స్థాయిల్లో 10,000-12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నామని పేర్కొంది. వీరిలో 5,000 మందికి తిరిగి శిక్షణనిచ్చి మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, మొత్తం మీద నికరంగా 5,000-6,000 ఉద్యోగాల కోత (మొత్తం ఉద్యోగుల్లో ఇది 2 శాతం) ఉండొచ్చని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి కాగ్నిజెంట్‌ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,89,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఏ ప్రాంతంలో పనిచేస్తున్నవారిని, ఎంతమందిని తొలగించేదీ తదితర వివరాలను ఈ కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ ఉద్యోగుల్లో అధిక భాగం భారత్‌లోనే ఉన్నందున ఉద్యోగాల కోత ప్రభావం ఇక్కడే అధికంగా ఉంటుందని అంచనా. భారత్‌లో దాదాపు 2 లక్షల వరకూ ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ కంటెంట్‌ ఆపరేషన్స్‌ బిజినెస్‌ నుంచి పాక్షికంగా వైదొలగనున్నది. ఫలితంగా మరో 6,000 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురి కానున్నారు. 



You may be interested

మందగమన తీవ్రతకు ‘మౌలికం’ అద్దం

Friday 1st November 2019

8 పారిశ్రామిక రంగాల గ్రూప్‌  సెప్టెంబర్‌లో పేలవ పనితీరు వృద్ధిలేకపోగా 5.2 శాతం క్షీణత న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌ సెప్టెంబర్‌ ఫలితాలు ప్రతిబింబించాయి. సమీక్షా నెల్లో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా - 5.2 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 సెప్టెంబర్‌ ఉత్పత్తితో పోల్చితే 2019 సెప్టెంబర్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యిందన్నమాట. గురువారం విడుదలైన అధికారిక  గణాంకాల ప్రకారం... ఎరువుల ఉత్పత్తి తప్ప

సిండికేట్‌ బ్యాంక్‌ లాభం రూ.251 కోట్లు

Friday 1st November 2019

మొండి బకాయిలు తగ్గాయ్‌  కేటాయింపులూ దిగివచ్చాయ్‌  రూ.6,153 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.251 కోట్ల నికర లాభం సాధించింది. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గి నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,545 కోట్లు, ఈ క్యూ1లో రూ.980 కోట్లు చొప్పున నికర నష్టాలు

Most from this category