News


బెంచ్‌టైమ్‌లో కోత విధించిన కాగ్నిజంట్‌

Saturday 23rd November 2019
news_main1574504710.png-29816

ఉద్యోగుల బెంచ్‌ టైమ్‌ గరిష్ఠ పరిమితిని దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజంట్‌ తగ్గించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో రాబోయే నెలల్లో పలువురి ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పెరిగాయి. నాన్‌ బిల్లబుల్‌ ప్రాజెక్ట్‌లోని ఉద్యోగులకు ఇప్పటివరకు 60 రోజులున్న బెంచ్‌టైమ్‌ గరిష్ఠకాలపరిమితిని తాజాగా 32 రోజులకు కంపెనీ తగ్గించింది.  35 రోజుల తర్వాత ఈ ఉద్యోగులకు ఎలాంటి ప్రాజెక్టు అసైన్‌ కాకపోతే కంపెనీ నుంచి వైదొలగాల్సిఉంటుంది. ఎగ్జిట్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు బెంచ్‌ టైమ్‌ తర్వాత 60- 90 రోజులుంటుంది. గతంలో ఇలాంటి ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు వెతుక్కునేందుకు మరింత గ్రేస్‌టైమ్‌ దొరికేది. కంపెనీ తాజా నిర్ణయంతో పలువురు ఉద్యోగులకు అశనిపాతమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


వేరే యూనిట్‌ లేదా వేరే ఊరికి బదిలీ చేస్తే వెళ్లనివాళ్లు, ఇతర బాధ్యతలు వద్దనుకునేవాళ్లను గతంలో కంపెనీ నుంచి తొలగించేవాళ్లు. తాజా నిర్ణయంతో సమయానికి ప్రాజెక్టు దొరకని ఉద్యోగులు కూడా బయటకు నడిచే పరిస్థితి రానుంది. ఈ విషయమై కాగ్నిజంట్‌ అధికారికంగా స్పందించలేదు. వ్యయ నియంత్రణ, ఫిట్‌ ఫర్‌ గ్రోత్‌​ విధానం లాంటి వాటిలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ కంపెనీలు బెంచ్‌ ఉద్యోగులను కొనసాగించేందుకు ఇష్టపడడంలేదని, ఉద్యోగం కాపాడుకోవాలంటే ఇలాంటి ఉద్యోగులంతా తప్పకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆర్థిక ఫలితాలు తిరోగమిస్తుండడంతో కాగ్నిజంట్‌ పలు వృద్ధి ప్రోత్సాహక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సవాళ్లను స్వీకరించి ఎలాంటి టాస్క్‌నైనా పూర్తి చేసే ఉద్యోగులను మాత్రమే కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవలే కంపెనీ దాదాపు 13వేల ఉద్యోగాలు తగ్గించుకుంటామని ప్రకటించింది. వీటిలో ఎక్కువ శాతం ఇండియా నుంచి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తం కాగ్నింజంట్‌ ఉద్యోగుల్లో 70 శాతం మంది భారత్‌లో పనిచేస్తున్నారు.You may be interested

క్రెడిట్‌ సూసీ నుంచి టాప్‌-5 రికమెండేషన్లు

Saturday 23rd November 2019

నాన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణ సంక్షోభం, క్షీణిస్తున్న వినియోగంతో పాటు ఇతరేతర కారణాలతో దేశీయ ఆర్థిక  తొలి త్రైమాసికంలో వ్యవస్థను మందగించింది. క్యూ1లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయినప్పటికీ అం‍తర్జాతీయ బ్రోకరేజ్‌ సం‍స్థ క్రిడిట్‌ సూసీ ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా దృక్పథాన్ని కలిగి వుంది. బ్రోకరేజ్‌ సంస్థ ప్రకారం... ఆర్థిక వ్యవస్థ

పతనమైన షేర్లపైనే మా దృష్టి...మార్క్‌ మొబియస్‌

Saturday 23rd November 2019

‘లిక్విడిటీ గురించి ఆలోచిస్తే చైనా, ఇండియా, టర్కి, సౌత్‌ ఆఫ్రికా వంటి మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ దీర్ఘకాల దృక్పథం ఉండి, ప్రైవేట్‌ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆఫ్రికాలోని దేశాలు మంచిది’ అని ఇన్వెస్ట్‌మెంట్‌ గురువు, మొబియస్‌, క్యాపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ మొబియస్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... మా కేటాయింపులు.. చైనాను ఇండియా అందుకుంటోంది. ఈ రెండు అతి పెద్ద దేశాలు.

Most from this category