News


కాఫీ డే లాభాలు క్యూ1లో రూ.1,567 కోట్లు

Thursday 14th November 2019
news_main1573702325.png-29569

  • గత క్యూ1లో రూ.21 కోట్లు మాత్రమే
  • కలసివచ్చిన ‘మైండ్‌ ట్రీ’ వాటా విక్రయం

న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) జూన్‌ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌) రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,567 కోట్లకు పెరిగిందని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో వాటా విక్రయం కారణంగా వచ్చిన అసాధారణ లాభాల కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.966 కోట్ల నుంచి రూ.942 కోట్లకు తగ్గిందని పేర్కొంది. కేఫ్‌ కాఫీ డే షాపులను నిర్వహించే ఈ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.., 
రూ.1,145 కోట్లకు వ్యయాలు...
మైండ్‌ ట్రీలో వాటా విక్రయం కారణంగా ఈ కంపెనీకి రూ.1,659 కోట్ల లాభం వచ్చింది. దీనితో కలుపుకొని ఈ క్యూ1లో రూ.1,777 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించింది. గత క్యూ1లో రూ.981 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ1లో 17 శాతం వృ‍ద్ధితో రూ.1,145 కోట్లకు పెరిగాయి. 
కంపెనీ చైర్మన్‌ విజి సిద్ధార్థ ఆత్మహత్య, దానికి దారితీసిన పరిణామాలపై రిటైర్డ్‌ సీబీఐ డీఐజీ అశోక్‌ కుమార్‌ మల్హోత్రా దర్యాప్తు చేస్తున్నారని కంపెనీ తెలిపింది. ఈ దర్యాప్తులో భాగంగా 2019 ఖాతా పుస్తకాల తనిఖీ జరుగుతోందని, ఇది పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని, అందుకే జూన్‌ క్వార్టర్‌ ఫలితాల వెల్లడి ఆలస్యమైందని తెలిపింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి మరికొంత కాలం పడుతుందని కంపెనీ తెలియజేసింది. 



You may be interested

స్పైస్‌జెట్‌ నష్టాలు రూ.463 కోట్లు

Thursday 14th November 2019

ప్రభావం చూపిన మ్యాక్స్‌ విమానాల వ్యయాలు  రూ.2,845 కోట్లకు పెరిగిన నిర్వహణ ఆదాయం న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సం‍స్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో రూ.463 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల సర్వీసులు నిలిపివేయడం వల్ల వ్యయాలు పెరిగాయని, అంతే కాకుండా సాధారణంగా సెప్టెంబర్‌ క్వార్టర్‌ బలహీనంగా ఉంటుందని, అకౌంటింగ్‌ నిబంధనల్లో మార్పుల వల్ల రూ.180 కోట్ల నష్టాలొచ్చాయని.... ఈ

రూపాయి... ఒకేరోజు 62 పైసలు పతనం!

Thursday 14th November 2019

రెండు నెలల కనిష్టం... 72.09కి డౌన్‌ ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం 62 పైసలు పతనం అయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్‌లో 72.09 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో (సెప్టెంబర్‌ 4 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం వంటి కీలక ఆర్థిక గణాంకాల నిరుత్సాహం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలపై అనుమానాలు వంటి

Most from this category