News


ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

Saturday 14th September 2019
news_main1568436870.png-28372

  • లిక్విడిటీ మెరుగునకు కాఫీడే చర్యలు

న్యూఢిల్లీ: ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడం (డీలివరేజింగ్‌) ద్వారా లిక్విడిటీ మెరుగునకు కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ చర్యలు చేపట్టింది. ఇటీవలే కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ (సీడీఈఎల్‌) దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘డి’ (ప్రతికూల దృక్పథానికి) ఇక్రా సంస్థ డౌన్‌ గ్రేడ్‌ చేసింది. అంతకుముందు వరకు బీబీ ప్లస్‌ నెగెటివ్‌ రేటింగ్‌ ఉండేది. రూ.315 కోట్ల దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ రేటింగ్‌ను ఇచ్చింది. సీడీఈఎల్‌ ఫ్లాగ్‌షిప్‌ సబ్సిడరీ అయిన కాఫీ డే గ్లోబల్‌ లిమిటెడ్‌, సికాల్‌ గ్రూపు కంపెనీలకు సంబంధించి రుణ చెల్లింపులు ఆలస్యం అవడంతో రేటింగ్‌ను తగ్గించినట్టు స్వయంగా సీడీఈఎల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడంతోపాటు, నిధుల లభ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్టు సికాల్‌ లాజిస్టిక్స్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ కంపెనీకి రూ.1,488 కోట్ల రుణభారం ఉంది. దీనికి కాఫీ డే గ్రూపు ప్రమోటర్‌, ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వీజీ సిద్ధార్థ వ్యక్తిగత హామీదారుగా ఉన్నారు. సికాల్‌ లాజిస్టిక్స్‌ పోర్ట్‌ టెర్మినళ్లు, ఫ్రైట్‌ స్టేషన్లలను నిర్వహిస్తోంది. సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత... సీడీఈఎల్‌ తన రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించడాన్ని గమనించొచ్చు. ఇందులో భాగంగానే బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్‌ టెక్నాలజీ పార్క్‌ను సుమారు రూ.3,000 కోట్లకు బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. 



You may be interested

స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో టాప్‌ సిఫార్సులు

Saturday 14th September 2019

దీర్ఘకాలానికి గాను బ్రోకరేజిలు సిఫార్సు చేసిన స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ స్టాకులు: విశ్లేషకులు: ట్రేడింగ్‌బెల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, అమిత్ గుప్తా బీసీఎల్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ రేణుక షుగర్స్‌ ప్రభుత్వం చమురు దిగుమతి బిల్లులను తగ్గించుకోడానికి ప్రయత్నిస్తోంది. ఫలితంగా ఇథనాల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభ్తుత్వం ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌(ఈబీపీ)ని ప్రోత్సహిస్తుండడంతో బీసీఎల్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ రేణుక షుగర్స్‌ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది.  అఫ్లె ఇండియా మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో వృద్ధి చెందుతుండడంతో అఫ్లె

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నికర లాభం రూ. 96.71 కోట్లు

Saturday 14th September 2019

ఉక్కునగరం (గాజువాక) : ప్రభుత్వ రంగ సంస‍్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2018–19లో రూ. 96.71 కోట్ల నికర లాభం ఆర్జించింది.  శుక్రవారం జరిగిన సంస‍్థ 37వ ఏజీఎంలో కంపెనీ  సీఎండి పి.కె.రథ్‌  ఈ వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది రూ. 20,844 కోట్ల టర్నోవర్‌ సాధించి మార్కెట్‌లో 8.80 శాతం వాటాతో అంతకు ముందు ఏడాది కంటే 25 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. ఆ ఏడాది వడ్డీలు, పన్నులు,

Most from this category