News


కోల్‌ ఇండియా కొత్త ప్రణాళికలతో సిద్ధం

Saturday 25th January 2020
news_main1579931911.png-31196

కొన్నేళ్లగా అనేక సవాళ్లను ఎదుర్కోన్న కోల్‌ ఇండియా మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. కిందటేడాది దేశవ్యాప్తంగా భారీ వర్షపాతం, నవంబర్‌లో సంభవించిన అకాల వర్షాలతో బొగ్గు ఉత్పత్తి, సరఫరాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా కోల్‌ ఇండియా ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయింది. గతేడాదిలో ఇండియా బొగ్గు వినియోగం 5.83శాతం క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

కోల్‌ ఇండియా దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారకు అయినప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో అధిక పరిమాణంలో, మంచి నాణ్యత కలిగిన బొగ్గును ఉత్పత్తి చేయలేకపోయింది. బొగ్గు నిల్వలకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో పర్యావరణానికి ఆటంకం కలిగించే మైనింగ్ వల్ల సంభవించే అటవీ నిర్మూలన మరో ప్రధాన సవాలుగా మారింది. చాలామంది అక్రమంగా బొగ్గు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు దేశం బొగ్గు కొరతను ఎదుర్కోంటుంది. మరోవైపు వ్యక్తిగత లాభాల కోసం బొగ్గును అక్రమంగా అమ్మడం వంటి దుష్ప్రచర్యలకు పాల్పడుతున్నారు.

రాబోయే సంవత్సరాల్లో మన దేశానికి మిలియన్ టన్నుల బొగ్గు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం బొగ్గు మైనింగ్ విభాగాన్ని విస్తరించడానికి  ప్రణాళికలు సిద్ధం రూపొందిస్తుంది. అందులో భాగంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగాల మధ్య సమతుల్యతను సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రణాళిక తమకు కలిసొస్తుందని కోల్‌ ఇండియా యాజమాన్యం భావిస్తోంది. ఇండియా ఇతర దేశాల నుండి పెద్ద మొత్తంలో బొగ్గును దిగుమతి చేస్తుంది. ఇది వ్యయాన్ని పెంచుతుంది. బొగ్గు రంగాన్ని వైవిధ్యపరచడం వల్ల ఇది సహేతుకమైన స్థాయికి తగ్గుతుంది. 

వైవిధ్యీకరణ ఆర్థిక వ్యవస్థలో మార్పులను తెస్తుంది. ఇది మార్కెట్లో మరింత పోటీని పెంచుతుంది. ఇది తుది వినియోగదారునికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. భారత్‌లో బొగ్గు ప్రధాన మైనింగ్ రంగంగా రూపాంతరం చేందే క్రమంలో ఉంది. అది జరిగిన తర్వాత... కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించినవారు దీర్ఘకాలిక అమ్మకపు ఒప్పందాల కోసం కోల్‌ ఇండియాతో పోటి పడాల్సి ఉంటుంది. 

ఈ పరిస్థితులకు తగ్గట్టుగా కోల్‌ ఇండియా తన సాంకేతిక పరిఙ్ఞాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అనేక అనేక బొగ్గు గనులకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు పొందడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సీఐఎల్‌కు సహాయం చేసింది. కాబట్టి ఇప్పుడు బొగ్గు నిల్వల లభ్యత సవాలును కూడా అధిగమించవచ్చు. కోల్‌ ఇండియా నిల్వల వాటా విలువ పెరుగుతుంది కాబట్టి, పోటీ ప్రయోజనం కూడా పెరుగుతుంది. ఈ విధంగా, కొత్త వ్యూహాలను అవలంబించడం ద్వారా ఈ ఏడాదిలో మార్కెట్లో మరింత దూసుకుపోవచ్చని యాజమాన్యం భావిస్తుంది.You may be interested

తగ్గిన పెట్రోల్‌ డీజీల్‌ ధరలు

Saturday 25th January 2020

 భారీగా తగ్గిన పెట్రోల్‌ డీజీల్‌ ధరలు న్యూఢిల్లీ: శనివారం ఒక్కసారిగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు భారీగా తగ్గాయి. చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌ రూ.27 పైసలు, డీజిల్‌ రూ.30 పైసలు తగ్గింది. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.74.16 గా ఉంటే ఆర్థిక రాజధాని ముంబైలో రూ.79.76, కోల్‌కతాలో రూ.76.77, చెన్నైలో రూ.77.03 గా ఉంది.

కరోనా షాక్‌-3 నెలల కనిష్టానికి చమురు

Saturday 25th January 2020

చమురుకు వైరస్‌ ఫీవర్‌! వారాంతాన 1.4 శాతం క్షీణించిన ధరలు గత వారం నికరంగా 7.5 శాతం పతనం చైనాలోని ఉహాన్‌లో తలెత్తిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వార్తలు ముడిచమురు ధరలను చల్లబరుస్తున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు విదేశీ మార్కెట్లో ధరలు వెనకడుగు వేశాయి. శుక్రవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.35 డాలర్లు(2.2 శాతం) క్షీణించి 60.69 డాలర్ల వద్ద ముగిసింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ బ్యారల్‌

Most from this category