News


కోల్‌ ఇండియా లాభం రూ.3,922 కోట్లు

Wednesday 12th February 2020
news_main1581476627.png-31705

కోల్‌కత: మైనింగ్‌ దిగ్గజం కోల్‌ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 14 శాతం పతనమై రూ.3,922 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.23,385 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో రూ.21,566 కోట్లకు చేరాయని కోల్‌ ఇండియా తెలిపింది. మొత్తం సమగ్ర ఆదాయం రూ.4,140 కోట్ల నుంచి రూ.3,670 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఇంధన సరఫరా ఒప్పందం(ఎఫ్ఎస్‌ఏ) ప్రకారం ఒక్కో టన్నుకు రూ.1,411 మేర మొత్తం రూ.18,015 కోట్ల రియలైజేషన్లు సాధించామని తెలిపింది. సగటు రియలైజేషన్‌ ఒక్కో టన్నుకు రూ.1,524గా ఉందని వివరించింది. గత క్యూ3లో 155.97 మిలియన్‌ టన్నులుగా ఉన్న ముడి బొగ్గు ఉత్పత్తి ఈ క్యూ3లో 147.50 మిలియన్‌ టన్నులకు తగ్గిందని తెలిపింది. 



You may be interested

భెల్‌ ఆదాయం రూ.5,828 కోట్లు

Wednesday 12th February 2020

17 శాతం తగ్గిన నికర లాభం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,564 కోట్ల నుంచి రూ.5,828 కోట్లకు చేరిందని భెల్‌ తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో

మహీంద్రా లాభం 85 శాతం డౌన్‌

Wednesday 12th February 2020

తీవ్రంగా ప్రభావం చూపిన మందగమనం  4 శాతం తగ్గిన ఆదాయం  స్వల్పంగా పెరిగిన మార్జిన్లు ముంబై: వాహన దిగ్గజం  మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో 85 శాతం క్షీణించి రూ..200 కోట్లకు తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. డిమాండ్‌ సంక్షోభం కారణంగా వాహన అమ్మకాలు తగ్గడంతో నికర లాభం ఈ రేంజ్‌లో తగ్గిందని తెలిపింది. గత క్యూ3లో రూ.519 కోట్ల వన్‌టైమ్‌ లాభాలు రాగా,

Most from this category