STOCKS

News


బకాయిల చెల్లింపునకు 10-15 ఏళ్ల గడువు

Friday 31st January 2020
news_main1580441314.png-31353

  • ప్రభుత్వానికి సీవోఏఐ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి బకాయిల చెల్లింపునకు టెలికం కంపెనీలకు 10-15 ఏళ్ల గడువు ఇవ్వాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) విజ్ఞప్తి చేసింది. తొలుత కొంత మొత్తం చెల్లించేలా వెసులుబాటుతోపాటు రెండేళ్లు మారటోరియం విధించాలని కోరింది. ఇదే జరిగితే భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాకు పెద్ద ఊరట లభించినట్టు అవుతుంది. ఇంటర్‌ బ్యాంకు లావాదేవీ మాదిరిగా వడ్డీ రేటు 45 శాతం ఉండాలని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూ కోరారు. ముందస్తు చెల్లింపు కింద బకాయిల్లో 15 శాతం మొత్తాన్ని అంగీకరించాలని విన్నవించారు. ప్రభుత్వం పొందే ఈ ముందస్తు చెల్లింపు ఎంత కాదన్నా రూ.15,000-20,000 కోట్లు ఉంటుందని గుర్తు చేశారు. టెలికం రంగం సంక్షోభంలో ఉన్నందున 10-15 ఏళ్ల గడువు ప్రతిపాదన సహేతుకమని ఆయన అభిప్రాయపడ్డారు. టెలికం కంపెనీలు నెట్‌వర్క్‌ విస్తరణకు, సాంకేతికతపై పెట్టుబడి చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. గతేడాది అక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి 15 టెలికం కంపెనీలు లైసెన్స్‌ఫీజు బకాయిలు రూ.92,642 కోట్లు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద రూ.55,054 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. తీర్పును పునర్‌ సమీక్షించాల్సిందిగా టెలికం కంపెనీలు ఈ నెల దాఖలు చేసిన రివ్యూ పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సీవోఏఐ ఈ విధంగా స్పందించింది. 



You may be interested

పసిడి... డిమాండ్‌ ఢమాల్‌..!

Friday 31st January 2020

భారత్‌లో 9 శాతం తగ్గిన డిమాండ్‌ ప్రపంచ పసిడి మండలి నివేదిక న్యూఢిల్లీ: ధరల తీవ్రతతో భారత్‌లో బంగారం డిమాండ్‌ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్‌ తగ్గడానికి దారితీసిందని మండలి పేర్కొంది. మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపిన సమాచారం ప్రకారం- నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... 2018లో దేశంలో బంగారం డిమాండ్‌ 760.4 టన్నులు. 2019లో ఈ

ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాలి

Friday 31st January 2020

బ్యాంకింగ్‌-ఎన్‌బీఎఫ్‌సీ రంగం డిమాండ్‌ మొండిబాకీల సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కొంత గాడిలోకి వస్తున్న బ్యాంకింగ్‌ రంగం రానున్న బడ్జెట్‌లో భారీస్థాయి ఆశలేవీ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే మూలధన నిధులను అందించడం, బలహీన బ్యాంకులను విలీనం చేయడం తదితర చర్యలతో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను చెప్పకనేచెప్పింది. అయితే, ఎన్‌పీఏ భయాలతో కార్పొరేట్‌ రంగానికి రుణాలను ఇచ్చేందుకు ఇప్పటికీ బ్యాంకులు జంకుతున్నాయి. ఈ తరుణంలో బడ్జెట్‌లో బ్యాంకులు ఏం కోరుకుంటున్నాయి? ఈ రంగంలో నిపుణులు

Most from this category